ETV Bharat / international

కార్చిచ్చు వచ్చినా, కరోనా వచ్చినా ఆ కేకలు వినపడవు! - Coronavirus in amazon forest

అమెజాన్​ అడవుల్లో ఆదివాసులకు సుస్తి చేస్తే వనమాతల ఒడిలో లభించే మూలికలతోనే రోగాన్ని వదలించుకుంటారు.. లేదా ప్రాణాలు విడుస్తారు. అక్కడ ఆస్పత్రులు ఉండవు. ఇంటర్నెట్​ సౌకర్యం అసలే ఉండదు. కరోనా మహమ్మారి లాంటి ఓ కొత్త వ్యాధి పుట్టుకొచ్చిందని తెలియదు. అలాంటి వారికి వైరస్​ సోకితే... ఆ గిరిపుత్రుల పరిస్థితి ఏంటి? ఇది చాలదన్నట్లు అడవుల నరికివేత, అక్రమ మైనింగ్‌ పెరిగిపోయింది. అక్కడి పాలకులు వారిని అసలు పట్టించుకుంటున్నారా? ప్రపంచానికి కానరాని అమెజాన్​ అడవి బిడ్డల పరిస్థితిపై ప్రత్యేక కథనం.

Brazil using coronavirus to cover up assaults on Amazon
అమెజాన్‌ అడవుల్లో వారి చావుకేకలు ఎవ్వరికి వినిపించవు!
author img

By

Published : May 24, 2020, 7:23 PM IST

అమెజాన్‌లో ఆదివాసుల పుట్టుక.. చావు రెండు అడవితల్లి ఒడిలోనే.. తమకు సోకిన వ్యాధి ఎంత ప్రమాదకరమైందో కూడా వారికి తెలియదు. వైద్యశాలలు, వెంటిలేటర్లు అనేవి వారి జీవితంలో చూసి ఉండరు. ఇప్పుడు పాలకులే ఆ అడవి తల్లిని చెరబట్టడానికి బయట కాచుకు కూర్చొన్నారు.. ఆ అడవిలో కార్చిచ్చు వచ్చినా.. కరోనా వచ్చినా కనికరించడంలేదు. అన్నీ తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల్లో ఆదివాసులు పిట్టల్లా రాలిపోతున్నారు.

కరోనా మహమ్మారి అమెజాన్‌ అడవుల్లోని ఆదివాసులకు సోకింది. ఏప్రిల్‌ మొదటి వారంలో కోకామ తెగకు చెందిన 20 ఏళ్ల యువకుడికి సోకింది. అమెజాన్‌లో ఇదే తొలి పాజిటివ్‌ కేసు. ఆ తర్వాత క్రమంగా విస్తరిస్తోందని 'ఆర్టిక్యూలేషన్‌ ఆఫ్‌ ఇండిజినియస్‌ పీపుల్స్‌ బ్రెజిల్‌' (ఏపీబీఐ) అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అమెజాన్‌ అడవుల్లో 980 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీరిలో 125 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే 12శాతానికి పైగా మరణించారు. బ్రెజిల్‌లో సగటు మరణాల కంటే ఇది రెట్టింపు. అక్కడి సర్కారీ లెక్కలు మాత్రం 695 మందికి వ్యాధి సోకితే కేవలం 34 మందే మరణించినట్లు చెబుతున్నాయి. వీరంతా ప్రభుత్వం నడిపే క్లీనిక్‌ల వద్ద రిజిస్టర్‌ చేసుకొన్న వారు మాత్రమే. ఈ లెక్కల్లోకి రానివారు చాలా మంది ఉన్నారు. ఈ అడవుల్లో దాదాపు 9లక్షల మంది ఆదివాసులు నివశిస్తున్నారు.

60 తెగల్లో కరోనా కేసులు..!

ఈ అడవుల్లో టుక్సా అనే తెగ ఉంది. వీరి జనాభా 1,400 మాత్రమే. ఇక్కడి వారు ఆసుపత్రికి వెళ్లాలంటే నాలుగున్నర గంటలు ప్రయాణించాలి. అది కూడా రోడ్డు మార్గంలో వెళ్లడం సాధ్యంకాదు. విమానమో.. పడవలోను ప్రయాణించాలి. ఇన్ఫోఅమెజోనియా లెక్కల ప్రకారం ఇక్కడ ఉన్న ప్రతి ఆదివాసి తెగ గ్రామం నుంచి ఆసుపత్రికి వెళ్లాలంటే సగటున 315 కిలోమీటర్లు ప్రయాణించాలి. అమెజాన్‌లోని 60 తెగల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి. 106 మంది ఉన్న కంబేబా అనే గ్రామంలో 16 కరోనాకేసులు వచ్చాయంటే పరిస్థతి అర్థం చేసుకోవచ్చు.

కరోనా వచ్చినా దోపిడీ ఆగలేదు..

అమెజాన్‌ అడవుల్లో ప్రకృతి సంపద దోపిడీ ఏమాత్రం ఆగలేదు. జైర్‌ బొల్సొనారో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అడవుల నరికివేత, అక్రమ మైనింగ్‌ పెరిగిపోయింది. గత ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో అడవుల నరికివేత 64శాతం పెరిగింది. గత నెలలోనే 156 చదరపు మైళ్ల అడవిని నరికేశారు. ఇప్పటికీ కలప అక్రమ రవాణా జరుగుతోంది. మరోపక్క వైరస్‌ ఉన్నా కానీ అడవుల నరికివేతకు వీలుగా చట్టాలను తెచ్చేందుకు బొల్సొనారో ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఎందుకిలా..?

అమెజాన్‌ అత్యధిక భాగం ఉండే బ్రెజిల్‌ ఆదాయ పరంగా ‘మిడిల్‌ ఇన్‌కమ్‌ ట్రాప్‌’ ఆర్థిక పరిస్థితుల్లో చిక్కుకుపోయింది. 2018 అక్టోబర్‌లో అధికారం చేపట్టిన బొల్సొనారో దేశ ఆదాయం పెంచుతానని, వాణిజ్యానికి అనుకూలమైన పాలసీలు తెస్తానని వాగ్దానం చేశారు. దీంతో ఆదాయాన్ని పెంచేందుకు కనిపించిన ప్రతిమార్గాన్ని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో అమెజాన్‌ వర్షారణ్యాలకు రక్షణగా నిలిచే పలు నిబంధనలను బలహీన పర్చారు. ఆ అడవుల్లో నివసించే ఆదివాసుల హక్కులను బలహీన పర్చారు. ఒక దశలో ఆదివాసులను దేశాభివృద్ధికి అడ్డంకిగా అభివర్ణించారు. దీంతో అక్రమార్కులకు బలం లభించింది. అమెజాన్‌లో అక్రమ గనుల తవ్వకాలు, కలప విక్రయాలు, వ్యవసాయం వంటివి పెరిగిపోయాయి. ఫలితంగా అక్కడ సోయాబీన్‌, ఆయిల్‌పామ్‌ వంటి వాణిజ్య పంటల సాగు చేయడం కోసం అడవికి నిప్పుపెట్టి భూమిని అందుబాటులోకి తెస్తున్నారు.

ఇదీ చూడండి: పాక్‌ విమానం కూలకముందు ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.