ETV Bharat / international

'భారత వ్యతిరేక శక్తులను కట్టడి చేయాలి'

గ్లాస్గోలోని ఐరాస వాతావరణ సదస్సు (కాప్​ 26) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​ భేటీ అయ్యారు. తీవ్రవాద, వేర్పాటువాద శక్తుల నిర్మూలన కార్యాచరణ సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

PM Modi, Britain Boris Johnson
ప్రధాని మోదీ, బ్రిటన్​ ప్రధాని బోరిస్​
author img

By

Published : Nov 2, 2021, 11:13 AM IST

Updated : Nov 2, 2021, 11:47 AM IST

భారత వ్యతిరేక తీవ్రవాద, వేర్పాటువాద శక్తులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​ అన్నట్లు విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష వర్ధన్‌ శ్రింగ్లా పేర్కొన్నారు. గ్లాస్గోలోని ఐరాస వాతావరణ సదస్సు (కాప్​ 26) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బోరిస్ మధ్య ఈ మేరకు ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లు తెలిపారు.

"బోరిస్​, ప్రధాని మోదీ మధ్య స్వల్పకాల వ్యవధిలో జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల్లో జరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఎలాంటి హక్కుల లేకుండానే చట్టవిరుద్ధమైన చర్యలకు దిగుతున్నారు. దీని వల్ల గందగోళ పరిస్థితులు నెలకొంటున్నాయన్న అంశాలు చర్చకు వచ్చాయి."

- విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష వర్ధన్‌ శ్రింగ్లా

ఈ నేపథ్యంలో.. వేర్పాటువాద ముఠాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని బోరిస్ పేర్కొన్నారు.​ ప్రజాస్వామ్య లేదా రాజ్యాంగబద్ధంగా అలాంటి ముఠాలను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వాతావరణ మార్పుపై భారత్​ నాయకత్వాన్ని ప్రశంసించారు.

ఈ క్రమంలో మాట్లాడిన మోదీ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నిధుల సమీకరణ (క్లైమేట్‌ ఫైనాన్స్‌), పునరుత్పాదక ఇంధనాలు, సౌరశక్తి వంటి సంయుక్త కార్యక్రమాలపై బ్రిటన్‌తో కలిసి పనిచేస్తామని మోదీ చెప్పారు. మరోవైపు, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులు విజయ్​ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించే అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ఎంతో కీలకమైన ఈ అంశంపై ఇరు దేశాల భద్రత సలహాదారులు నవంబరు 3న ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Nov 2, 2021, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.