ETV Bharat / international

కొవిడ్​ ఆసుపత్రిలో మంటలు-10 మంది మృతి

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. రొమేనియాలో జరిగిన ఈ ఘటనలో 10 మంది రోగులు చనిపోయారు.

At least 10 dead in fire at Romania COVID hospital
కొవిడ్​ ఆసుపత్రిలో మంటలు-10 మంది మృతి
author img

By

Published : Nov 15, 2020, 5:30 AM IST

రొమేనియాలోని పియట్రా నీమ్ట్​ ప్రాంతంలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఐసీయూ వార్డులోకి ఎగబాకాయి. ఈ దుర్ఘటనలో 10 మంది రోగులు చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.

At least 10 dead in fire at Romania COVID hospital
ఆసుపత్రిలో చెలరేగిన మంటలు

ఐసీయూ నుంచి వెలువడుతున్న పొగ

షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే ప్రమాదం జరిగిందని రొమేనియా ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అలుముకున్న పొగ

అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.