ETV Bharat / international

అస్ట్రాజెనికా టీకాతో యూకే స్ట్రెయిన్​కు చెక్!

తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా బ్రిటన్​ స్ట్రెయిన్​ను ఎదుర్కోగలుగుతుందని అస్ట్రాజెనికా పరిశోధకులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్​పై టీకా ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నట్లు వివరించారు.

author img

By

Published : Feb 6, 2021, 5:58 AM IST

AstraZeneca Vaccine my work on UK strain
బ్రిటన్​ స్ట్రెయిన్​పై ఆస్ట్రాజెనెకా టీకా ప్రభావం

కరోనా వైరస్ బ్రిటన్​ స్ట్రెయిన్​పై తమ టీకా పని చేస్తుందని అస్ట్రాజెనికా వ్యాక్సిన్​ అభివృద్ధి చేసిన పరిశోధకులు చెబుతున్నారు. ఫైజర్​, మోడెర్నా టీకాల ఫలితాల మాదిరిగానే దీని ప్రభావం కూడా ఉంటుందని తెలిపారు.

కొవిడ్ 19 సోకిన వ్యక్తుల్లో వైరస్​ ప్రభావాన్ని తగ్గిస్తుందని టీకా తయారీలో భాగస్వామ్యమైన ఆక్స్​ఫార్ట్​ యూనివర్సిటీకి చెందిన ఆండ్రూ పొలార్డ్ పేర్కొన్నారు. ఇది వ్యాధి వ్యాప్తిని నెమ్మదిస్తుందని వివరించారు. దీనిపై జరిగిన పరిశోధన ఇంకా 'పీర్​ రివ్యూ' జర్నల్​లో ప్రచురితం కాలేదని తెలిపారు.

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ మరో కొత్త రకం కరోనా వైరస్​పైనా ఈ వ్యాక్సిన్ పని చేసే సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

ఇదీ చూడండి:'వారికి ఒక్క డోసు కరోనా టీకా చాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.