భారత్‌లో తమ కార్యకలాపాలు అన్నింటినీ నిలిపివేస్తున్నట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. భారత ప్రభుత్వం నిరాధార ఆరోపణలపై తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలను, పరిశోధన పనులను నిలిపివేయాలని తమ సిబ్బందికి సూచిస్తూ అమ్నెస్టీ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈనెల 10న తమ బ్యాంకు ఖాతాలను పూర్తిగా స్తంభింపజేయటం వల్ల సంస్థ చేపడుతున్న పనులు నిలిచిపోయినట్లు తెలిపింది ఆమ్నెస్టీ ఇండియా. అయితే తమ చర్యను సమర్థించుకున్న కేంద్ర ప్రభుత్వం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అక్రమంగా విదేశీ నిధులు పొందినట్లు తెలిపింది.