అమెరికాలో తమ సంస్థకు చెందిన ఫ్రంట్లైన్ సిబ్బందిలో దాదాపు 20 వేల మందికి కరోనా వైరస్ సోకినట్లు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గురువారం ప్రకటించింది. తొలిసారి ఈ డేటా వెల్లడించిన అమెజాన్.. సాధారణ అమెరికా ప్రజలతో పోలిస్తే తమ ఉద్యోగుల్లో వైరస్ వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
గత కొన్ని నెలలుగా కంపెనీ ఉద్యోగులు, కార్మికులు.. సంస్థలో కరోనా కేసుల వివరాలు వెల్లడించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివరాలు వెల్లడించింది అమెజాన్.
ఉద్యోగులకు సమాచారం ఇవ్వడం సహా.. ప్రభుత్వం, ఇతర కంపెనీలతో పరస్పర సహకారానికి ఈ వివరాలను వెల్లడించినట్లు పేర్కొంది.
ఇతర పెద్ద కంపెనీలు పరస్పర సహకారకం కోసం.. కరోనా కేసుల వివరాలు వెల్లడిస్తాయని ఆశిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఇది కంపెనీల మధ్య పోటీపడాల్సిన అంశం కాదని సూచించింది. అమెరికాలోని.. అమెజాన్, హోల్ ఫుడ్ మార్కెట్ సంస్థల్లో పని చేస్తోన్న 13.7 లక్షల మంది ఉద్యోగులపై మార్చి 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు జరిపిన పరీక్షల ఆధారంగా ఈ డేటాను విడుదల చేసినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో 6.5 శాతం నిరుపేదలే!