ETV Bharat / international

కేబుల్ కార్ కూలి 9 మంది మృతి

ఆదివారం ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. కేబుల్​ కార్ కూలిన ఘటనలో 9 మంది మరణించారు.

A cable car plunged to the ground in northern Italy, killing 9 people
ఇటలీలో కేబుల్ కారు కూలి 9 మంది మృతి
author img

By

Published : May 23, 2021, 6:30 PM IST

Updated : May 23, 2021, 7:00 PM IST

ఇటలీలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. మౌంటెయిన్ కేబుల్ కార్ కూలిన ఘటనలో తొమ్మిది మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఆల్ప్స్​ పర్వత ప్రాంతాల్లో మోటరోన్ శిఖరంపైకి.. సముద్ర మట్టానికి 1,491 మీటర్లు ఎత్తుకు చేరుకునే ఈ కేబుల్ కార్ పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. అక్కడ ఆల్పైలాండ్ అనే చిన్న ఉద్యానవనం నుంచి 360 డిగ్రీల ప్రకృతి వీక్షణను ఆస్వాదించేందుకు వేసవిలో పర్యటకులు క్యూ కడుతుంటారు. ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో ఈ తరహా పర్యటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి.

2016లో పునరుద్ధరించిన ఈ కేబుల్ కార్ పర్యటక ప్రాంతం.. కరోనా వైరస్ కారణగా మూతపడింది. అయితే.. లాక్​డౌన్ అనంతరం ఈ మధ్యే తెరుచుకుంది.

ఇవీ చదవండి: లైవ్ వీడియో: బద్ధలైన అగ్నిపర్వతం

Last Updated : May 23, 2021, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.