తొమ్మిది అడుగులు పొడవైన(2.7మీటర్లు) వీడియో గేమ్ జాయ్స్టిక్కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్-2022లో చోటు దక్కింది. జర్మనీలోని డార్ట్మౌత్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ మేరీ ఫ్లానగన్ దీన్ని తయారు చేశారు. కలప, రబ్బరు, స్టీల్‌తో దీన్ని రూపొందించారు. అటారీ వీడియో గేమ్స్ ఆడేందుకు ఉపయోగించే సాధారణ జాస్టిక్ కంటే ఇది 14 రెట్లు అధిక పరిమాణంలో ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేయాలంటే కనీసం ఇద్దరు ఉండాలి.

చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని, వాటికి అడిక్ట్ అయినట్లు కూడా మేరి తెలిపారు. ఒక్కరు వీడియో గేమ్ ఆడుతుండగా.. ఆ అనుభూతిని మరొకరు కూడా పొందితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే దీన్ని తయారు చేసినట్లు చెప్పారు. దీనితో సెంటీపీడ్, బ్రేక్ఔట్ వంటి అటారీ గేమ్స్ ఆడుకోవచ్చన్నారు. వీడియో గేమ్స్ అలవాటు లేని వారిని కూడా గేమ్‌లో భాగస్వాములను చేస్తే తమాషాగా ఉంటుందన్నారు.

ఈ జాయ్‌స్టిక్‌ను స్పెయిన్, బ్రిటన్, అమెరికాలో కూడా ప్రదర్శనకు తీసుకెళ్లారు. ఇప్పుడు జర్మనీ కార్ల్స్రూహిలోని ZKM ఆర్ట్ అండ్ మీడియా సెంటర్ శాశ్వాత సేకరణలో భాగమైంది.

ఇదీ చదవండి: వ్యోమగాములకు టాయిలెట్లు బంద్... డైపర్లే దిక్కు!