ప్రపంచంలో ఏ మూలనున్నా ప్రతిభ, కష్టించే గుణంతో భారతీయులు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ ఉంటారు. ఇదే కోవలోనే బ్రిటన్ అందించే అరుదైన పురస్కారం అందుకోనున్నారు 35 మంది ప్రవాస భారతీయులు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 నిర్వహించనున్న నూతన సంవత్సర వేడుకల్లో వీరికి పురస్కారం దక్కనుంది. క్వీన్స్ న్యూ ఇయర్ ఆనర్స్ లిస్ట్-2019 పేరుతో వివిధ రంగాల్లో చేసిన సేవలకుగాను ఈ పురస్కారాలను అందించనున్నారు.
ఈ జాబితాలో ముగ్గురు కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, ఆరుగురు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, 16మంది మెంబర్స్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, 10 మంది బ్రిటిష్ ఎంపైర్ మెడల్ అవార్డులు అందుకోనున్నారు.
బ్రిటన్ రాణి నుంచి సత్కారం అందుకోనున్న వారిలో ప్రముఖ నృత్యకారిణి శోభనా జైసింగ్, ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ అదితి లాహిరి, ఎన్ఈసీ సంస్థ సీఈఓ పాల్ పవన్‌దీప్ తాండి, కోరం యూకే సీఈఓ రేణుక ప్రియదర్శిని డెంట్, అరుణ్‌దీప్ సింగ్ కాంగ్‌తో పాటు మొత్తం 35 మంది ప్రవాస భారతీయులకు వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకుగాను పురస్కారాలు అందుకోనున్నారు.
ఇదీ చూడండి: ఆరుపదుల వయసులో ఏడడుగుల బంధంతో..!