ETV Bharat / international

రోడ్లపై వేగం 30కి.మీలు దాటితే.. ఇక అంతే! - రోడ్లపై వేగాన్ని తగ్గించిన పారీస్​

నగరంలోని రోడ్లపై గంటకు ముప్పైకి మించి వేగంగా ప్రయాణిస్తే వాహనదారులపై చర్యలు తప్పవని అంటున్నారు పారిస్​ అధికారులు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Paris shrinks speed limit
ప్యారిస్​లో స్పీడ్​ లిమిట్​
author img

By

Published : Aug 30, 2021, 6:24 PM IST

రోడ్లమీద గంటకు 30 కి.మీకి మించి.. అధిక వేగంతో ప్రయాణిస్తే వేటు తప్పదంటున్నారు పారిస్​ అధికారులు. పర్యావణ హితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పారిస్​లోని ఈఫిల్ టవర్​, లాటిన్ క్వార్టర్​ లాంటి ప్రాంతాలవైపు వెళ్లేటప్పడు నిర్దేశించిన వేగానికి మించకుండా ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు. సోమవారం నుంచి దాదాపు పారిస్‌లోని అన్ని వీధుల్లో ఈ నిర్ణయం అమలవుతుందని అక్కడి అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.

నగరంలో కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న అధికారులు.. ఈ నిర్ణయంతో నగరంలో ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుందని వివరించారు. పాదాచారులకు మరింత సౌకర్యవంతగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ నిర్ణయంపై వాహనదారులు మండిపడుతున్నారు. డెలివరీ ఏజెంట్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులకు వస్తువులు చేరవేయాలి అంటే చాలా సమయం పడుతుందని అన్నారు. అంతేగాకుండా ట్యాక్సీ డ్రైవర్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై చేపట్టిన సర్వేలో మాత్రం చాలామంది పారిస్​ ప్రజలు ఈ నిర్ణయానికి ఓటేయడం గమనార్హం. దీంతో పారిస్​లో సురక్షితమైన, వాయుకాలుష్యం లేని రోడ్లను చూడవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: స్టూడెంట్ మాస్క్ వేసుకోలేదని.. క్లాస్ మధ్యలోనే ప్రొఫెసర్ రిటైర్మెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.