కొవిడ్-19 (కరోనా) ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌ల ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా ఫ్రాన్స్ మర్సై నగరంలోని ఓ ఆసుపత్రిలో దాదాపు 2,000 మాస్కులు దోపిడీకి గురయ్యాయి.
ఈ మాస్క్‌లు అన్నీ శస్త్రచికిత్స చేసే సమయంలో ధరించేవని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మాస్క్‌లు, చేతి గ్లౌజుల భద్రతపై మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
కరోనా బాధితుల కోసం మాస్క్‌లను భద్రపరచాలని దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ప్రకటించిన అనంతరం ఈ దొంగతనం జరగడం గమనార్హం.
ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు నలుగురు కరోనా వైరస్ వల్ల మరణించారు. 204 కేసులు నమోదయ్యాయి. జపాన్‌లోని ఓ ఆసుపత్రిలోనూ ఫిబ్రవరిలో 6,000 మాస్కులు తస్కరణకు గురయ్యాయి.
- ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: దిల్లీలో మాస్క్‌ల ధరలకు రెక్కలు