Worldwide malaria cases: ప్రపంచవ్యాప్తంగా ఏడాది కాలంలో (2019తో పోలిస్తే 2020లో) 1.4 కోట్ల మలేరియా కేసులు, 69 వేల మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఓ నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలకు సంబంధించి.. భారత్‌లో ఈ వ్యాధి కొంత తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. అయితే ప్రపంచంలో 80 శాతం మలేరియా వ్యాప్తి ఆగ్నేయాసియాలోనే ఉన్నట్లు పేర్కొంది. 'ప్రపంచ మలేరియా నివేదిక 2021' పేరుతో డబ్ల్యూహెచ్‌ఓ దీన్ని వెల్లడించింది.
Who malaria report: ప్రపంచంలో అత్యంత పేద, దుర్బల ప్రాంతాల్లో మలేరియా తీవ్రంగా ప్రబలినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తన నివేదికలో పేర్కొంది. ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో పరీక్షలతో పాటు, దోమల నియంత్రణ చర్యలు కూడా తగ్గినట్లు తెలిపింది. ఈమేరకు మలేరియా నిర్మూలనకు గాను - సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, ఇతర భాగస్వాములు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లాలని.. గట్టి రాజకీయ సంకల్పం అవసరమని.. మరిన్ని నిధులు కేటాయించాలని డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలో సూచించింది.
ఇదీ చూడండి: మలేరియాపై టీకాస్త్రం.. దశాబ్దాల నిరీక్షణకు తెర!
ఇదీ చూడండి: Bharat Biotech: మలేరియాకు భారత్ బయోటెక్ టీకా.. జీఎస్‌కే భాగస్వామ్యంతో...