ETV Bharat / international

జపాన్ ప్రధానిగా యొషిహిదె అధికారిక ఎన్నిక - జపాన్ ప్రధాని

జపాన్ ప్రధానిగా యొషిహిదె సుగా అధికారికంగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ ఓటింగ్​లో సభ్యులు సుగాను ఎన్నుకున్నారు. జపాన్ తదుపరి ప్రధానిగా ఎన్నికైన సుగాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Yoshihide Suga named Japan's prime minister, succeeding Abe
జపాన్ ప్రధానిగా యొషిహిదె అధికారికంగా ఎన్నిక
author img

By

Published : Sep 16, 2020, 11:51 AM IST

జపాన్ తదుపరి ప్రధానిగా యొషిహిదె సుగా అధికారికంగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ ఓటింగ్​లో సుగాను సభ్యులు ఎన్నుకున్నారు.

షింజో అబె స్థానంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు సుగా. అనారోగ్య కారణాలతో అబె తన పదవికి రాజీనామా చేశారు. అధికార పార్టీ లీడర్​గా సోమవారమే ఎన్నికయ్యారు. మరికొద్ది సేపట్లో సుగా తన మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు.

మోదీ శుభాకాంక్షలు

జపాన్ ప్రధానిగా ఎన్నికైన సుగాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకంక్షలు తెలిపారు. ఇరుదేశాల మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుగాతో కలిసి నూతన శిఖరాలకు చేర్చేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు మోదీ.

అబెకి నమ్మకస్తుడు

సుదీర్ఘకాలం పాటు జపాన్ ప్రధానిగా అబె కొనసాగారు. అబె కుడి భుజంగా, అత్యంత నమ్మకమైన నేతగా సుగా పేరు సంపాదించారు. చీఫ్ కేబినెట్ సెక్రటరీగా సేవలు అందించిన సుగాకు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ మద్దతుగా ఉంది. పార్లమెంట్​లో ఈ పార్టీకి పూర్తి ఆధిక్యం ఉంది.

రైతు బిడ్డ...

స్ట్రాబెరీలు పండించే రైతు కుటుంబంలో జన్మించిన సుగా.. స్వతహాగా రాజకీయనాయకుడిగా ఎదిగారు. 'వ్యవసాయ కుటుంబ నుంచి వచ్చినందున సాధారణ ప్రజల ప్రయోజనాల మేరకే పనిచేస్తానని' ఎన్నోసార్లు చెప్పారు. అబె అనుసరించిన దౌత్య, ఆర్థిక విధానాలను సుగా కొనియాడారు. అసంపూర్ణంగా మిగిలిపోయిన అబె విధివిధానాలను పూర్తి చేస్తానని వాగ్దానం చేశారు. కరోనాతో పోరాడి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తన తొలి ప్రాధాన్యంగా నొక్కిచెప్పారు. సంస్కరణలపై దృష్టిసారించే వ్యక్తులనే కొత్త మంత్రివర్గంలో నియమిస్తానని వెల్లడించారు.

సవాళ్లివే!

జపాన్ కొత్త ప్రధానికి ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. తూర్పు చైనా సముద్రంలో పెత్తనం చెలాయిస్తున్న చైనాతో సంబంధాలు ఎలా సాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఒలింపిక్స్ నిర్వహణ కూడా సుగా ముందున్న సవాలే. రాబోయే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయితే.. వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.