అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చైనాలోని భారత రాయబార కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆసనాలు వేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న వేళ భౌతిక దూరం పాటిస్తూ.. యోగా చేసినట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. సనాతన భారత సంప్రదాయాల్లో భాగమైన యోగా నేడు ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.



