ETV Bharat / international

'టీకా అభివృద్ధి కోసం భారత్​కు సహకరిస్తాం' - కరోనా టీకా జిన్​పింగ్​

12వ బ్రిక్స్​ సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​.. కరోనా టీకా అభివృద్ధిలో భారత్​తో పాటు ఇతర సభ్య దేశాలకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో సభ్య దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.​

xi-offers-to-cooperate-with-india-brics-countries-to-develop-covid-19-vaccine
టీకా అభివృద్ధి కోసం భారత్​కు సహకరిస్తాం: జిన్​పింగ్
author img

By

Published : Nov 18, 2020, 5:21 AM IST

కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధిలో భారత్​తో పాటు ఇతర బ్రిక్స్​ సభ్య దేశాలకు సహకారం అందిస్తామని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ ఉద్ఘాటించారు. 12వ బ్రిక్స్​ శిఖరాగ్ర సదస్సులో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్న జిన్​పింగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

"వ్యాక్సిన్​ మూడో దశ ట్రయల్స్​కు సంబంధించి రష్యా, బ్రెజిల్​తో చైనా కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి. దక్షిణాఫ్రికా, భారత్​తోనూ సహకారం ఏర్పరచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. కోవాక్స్​ బృందంలో చైనా చేరింది. అవసరమైనప్పుడు బ్రిక్స్​ సభ్య దేశాలకు వ్యాక్సిన్​ అందించే విషయాన్ని చైనా పరిశీలిస్తోంది."

-- జిన్​పింగ్​, చైనా అధ్యక్షుడు.

అంతర్జాతీయ వ్యాక్సిన్​ కూటమి గావి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వం వహిస్తున్న బృందమే ఈ కోవాక్స్​. టీకా అభివృద్ధి, తయారీని వేగవంతం చేయడమే దీని లక్ష్యం.

'విభేదాలను పరిష్కరించుకోవాలి'

బ్రిక్స్​ సభ్య దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు జిన్​పింగ్​. ఓ దేశ అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకునే విధానాన్ని బ్రిక్స్​ బృందం వ్యతిరేకించాలన్నారు.

ఆరు నెలలుగా భారత్​-చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో జిన్​పింగ్ ఈ​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి:- 'ఉగ్రవాదంపై ఆ దేశాలను బాధ్యులుగా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.