ETV Bharat / international

పాక్​, దక్షిణ కొరియాలపై మళ్లీ వైరస్ పంజా - నేపాల్​ లాక్​డౌన్​

పాక్​లో మూడో దశ కరోనా విజృంభిస్తోంది. వైరస్ ధాటికి ఒక్కరోజే 135 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ​ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మరోవైపు దక్షిణ కొరియాలోనూ మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. అక్కడ కొత్తగా 731 కేసులు నమోదయ్యాయి.

world corona
ప్రపంచ కరోనా కేసులు
author img

By

Published : Apr 15, 2021, 7:50 AM IST

పాక్​లో అత్యంత ప్రమాదకరమైన బ్రిటన్​ తరహా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఒక్కరోజులోనే అత్యధికంగా 135 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. దీనితో అక్కడ మహమ్మారి ధాటికి మరణించిన వారి సంఖ్య 15,754 కు చేరుకుంది.

పాక్​లో కేసులు ఇలా..

  • కొత్త కేసులు: 4,681
  • మొత్తం కేసుల సంఖ్య: 734,423​
  • ఇప్పటివరకు కోలుకున్న వారు: 641,912
  • యాక్టివ్​ కేసుల సంఖ్య: 75,758

దేశంలో కరోనా వ్యాక్సినేషన్​ వేగంగా సాగుతోందని పాక్​ ప్రభుత్వం తెలిపింది. రంజాన్​ తర్వాత టీకా పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతం చేయనున్నట్లు వెల్లడించింది.

"ప్రస్తుతం రోజూ 60-70 వేల మందికి టీకాలు ఇస్తున్నాం. రంజాన్​ తర్వాత ఈ సంఖ్యను లక్షా యాభై వేల నుంచి రెండు లక్షలకు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం 9 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. ప్రజా టీకా కార్యక్రమానికి 150 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ఆమోదిస్తూ కేబినెట్​ ఆమెదం తెలిపింది".

-అసద్ ఉమర్, ప్రణాళికా మంత్రి

ద.కొరియాలోనూ..

దక్షిణ కొరియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరించారు. బుధవారం అక్కడ 731 కొత్త కేసులు నమోదైనట్లు కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ (సీడీసీ) తెలిపింది. దీనితో ద.కొరియాలో మొత్తం కేసుల సంఖ్య 111,419కి పెరిగింది. ఇక కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 1,782 మరణాలు నమోదైనట్లు సీడీసీ వెల్లడించింది. అక్కడ గడచిన మూడు నెలల్లోనే రెట్టింపయ్యాయంటే పరిస్థితి తీవ్రతను తెలుసుకోవచ్చు.

దేశంలో టీకా పంపిణీ మందకొడిగా సాగుతుండటం.. కరోనా జాగ్రత్తలు పాటించకుండా ప్రజలు సంచరిస్తున్న నేపథ్యంలో కేసులు పెరుగుతున్నట్లు సీడీసీ పేర్కొంది.

''గత వారాంతం నుంచి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడుతున్నారు. వారిపై నిఘా తగ్గిందనేందుకు ఇదొక నిదర్శనం. సామాజిక దూరం సహా ఇతర కరోనా నిబంధనలను కఠినతరం చేసేందుకు చర్చించి, తొందర్లోనే నిర్ణయం తీసుకుంటాం''.

-యూన్ తైహో, సీనియర్ హెల్త్ ఆఫీసర్.

అవసరమైతే లాక్​డౌన్..

నేపాల్​లో కరోనా కేసులు పెరిగితే రాబోయే రోజుల్లో లాక్​డౌన్ విధించే అవకాశం ఉందని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి బుధవారం హెచ్చరించారు. నేపాలీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రసంగించిన ఆయన.. దేశంలో రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొవిడ్-19 నిబంధనలను పాటించాల్సిందిగా ప్రజలను కోరారు. కరోనా నిబంధనలు పాటిస్తేనే రోజువారీ కార్యకలాపాలను సాగించగలమని అభిప్రాయపడ్డారు.

నేపాల్‌లో రోజూ సుమారు 100 కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ప్రస్తుతం 3,608 క్రియాశీల కేసులున్నాయి.

ఇవీ చదవండి: వ్యాక్సినేషన్‌ వేగవంతమైన దేశాల్లో కొవిడ్​ తగ్గుముఖం

వేగంగా వ్యాపిస్తున్న బ్రిటన్‌ వైరస్‌- మరణ ముప్పు తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.