కాలిఫోర్నియా అనహెమ్‌లో పాప్ సాంస్కృతిక కన్వెన్షన్ జరుగుతోంది. కామిక్ పుస్తకాలు, సినిమా, టీవీ కార్యక్రమాల్లోని వివిధ వేషధారణలతో వండర్కాన్ ప్రదర్శకులు ఆకట్టుకుంటున్నారు. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్, జీనీ, హల్క్ లాంటివి ఇందులో ఉన్నాయి.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి మొత్తం 60 వేల మంది హాజరవుతారని అంచనా.
హలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టూడియోలు రూపొందించనున్న కామిక్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఇందులో మార్వెల్ స్టూడియోకు చెందిన క్లాక్ అండ్ డగ్గర్, ఎక్స్-మెన్ సిరీస్‌లో 'డార్క్ ఫోనిక్స్' వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.