ETV Bharat / international

ఆఫ్గాన్​ ఆంక్షల చట్రంలో మహిళల దుర్భర జీవనం - ఆఫ్గనిస్థాన్​లో యుద్ధ మేఘాలు

నిత్యం యుద్ధాలతో సావాసం చేసే సిరియా, ఇరాక్, యెమెన్​, అఫ్గానిస్థాన్​లలో మహిళల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కనీసం వారి పరిస్థితులను పట్టించుకునే వారే లేరు. అయినప్పటికీ, కొంతమంది మహిళలు ధైర్యం చేసి భద్రత, స్వేచ్ఛ దిశగా సాగే మార్గాల్ని అన్వేషిస్తున్నారు. అదేవిధంగా పశ్చిమాసియా దేశాల్లోనూ ఇలానే ఉంది.

Woman's miserable life in the framework of sanctions in Afghanistan
ఆఫ్గాన్​లో ఆంక్షల చట్రంలో మహిళల దుర్భర జీవనం
author img

By

Published : Mar 6, 2020, 8:51 AM IST

ఒక యుద్ధంలో ముందుగా బలయ్యేది నిజం. ఆ తరవాత వంతు మహిళలది. యుద్ధాలతో ఛిద్రమైన సిరియా, ఇరాక్‌, యెమెన్‌, అఫ్గానిస్థాన్‌లలో మహిళల పరిస్థితి ప్రస్తుతం ఇదే. ఆ దేశాల్లో మహిళల మనోభావాల్ని, స్థితిగతుల్ని పట్టించుకునేవారే లేకుండా పోయారు. అయినప్పటికీ, కొంతమంది మహిళలు ధైర్యం చేసి భద్రత, స్వేచ్ఛ దిశగా సాగే మార్గాల్ని వెదుక్కుంటున్నారు. ఒకప్పుడు తాలిబన్‌ ఆధిపత్యంలో మగ్గిన ప్రాంతాల్లో ఇప్పుడు ఇలాంటి మార్పే కనిపిస్తోంది. అఫ్గానిస్థాన్‌లో కొన్ని ప్రావిన్సులు మినహా, మొత్తం దేశంలో ముఖ్యంగా పాకిస్థాన్‌తో సరిహద్దులు కలిగిన ప్రావిన్సుల్లో మహిళలు తమ ఆకాంక్షల్ని చంపుకొని ఆదిమ జీవనశైలిని పాటించడం కనిపిస్తుంటుంది. పశ్చిమాసియా దేశాల్లోని మహిళలదీ ఇలాంటి పరిస్థితే. ఈ ప్రాంతాల్లోని మహిళలు పురుషులతో సమానమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో కూడిన సంస్కృతిని ఇష్టపడినా, అధికారం చెలాయించిన పాలకులు అందుకు ససేమిరా అంగీకరించలేదు.

పాపభీతికి పలు కోణాలు...

చాలామంది మహిళలు తమలో గూడుకట్టుకున్న అవగాహన రాహిత్యం కారణంగా తాము అనుసరిస్తున్న విధానం తమ మతాచారంలో భాగమని భావిస్తారు. హక్కుల విషయంలోనూ ఇదే భావన గూడుకట్టుకుని ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల మధ్యే మహిళలు దశాబ్దాలుగా, శతాబ్దాలుగా జీవనం సాగించేస్తున్నారు. అక్కడి సమాజాల్లో భాగస్వామిని ఎంచుకునే విషయంలో పురుషులకు స్వేచ్ఛ ఉంది. అదే మహిళల విషయానికి వచ్చేసరికి తమ పితృస్వామిక కుటుంబ వ్యవస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. పురుషులు తమలోని భావాలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. మహిళలు మాత్రం మనసులో మాటను తమలో తాము దిగమింగుకోవాల్సిందే. పాపభీతికి పలు కోణాలు, నిర్వచనాలు ఉన్నాయి. పురుషుడు పాపానికి పాల్పడితే చెల్లించుకోవాల్సిన మూల్యం విభిన్నంగా ఉంటోంది. అదే మహిళ విషయానికికొచ్చేసరికి అలవికానంతటి నష్టాన్ని భరించాల్సిందే.

పురుషస్వామ్య దాష్టీకం..

గత రెండు దశాబ్దాల కాలంగా అఫ్గానిస్థాన్‌ యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకుని అతలాకుతలమైంది. తాలిబన్‌ పాలనలో మహిళలు తమ కుటుంబ పోషణ కోసం ఏదైనా పని చేసుకోవాలన్నా కష్టంగా ఉండేది. బాలబాలికలు కలిసి చదువుకోగల విద్యాసంస్థల్లోనూ అమ్మాయిలు విద్యాభ్యాసానికి వెళ్లడానికి వీల్లేని పరిస్థితి. వారి అభిప్రాయాల్ని, అనుభూతుల్ని అభివ్యక్తీకరించేందుకు వీలున్న ప్రతి అవకాశాన్నీ తొక్కిపెట్టేశారు. దీనికితోడు మహిళలు అపరిచితులకు చాలా దూరం పాటించాలి. స్త్రీల ముఖం, గొంతు కూడా అపరిచితులకు కనిపించకకూడదు, వినిపించకూడదన్నట్లు ఆంక్షలు విధించారు. అరబ్‌ ప్రపంచంలో ముస్లిం మహిళలదీ దాదాపు ఇలాంటి పరిస్థితే. అత్యవసర పరిస్థితుల్లో సైతం మహిళలు తమ కుటుంబ సభ్యులను తీసుకొని బయటికి వెళ్లడానికి వీల్లేదు. ఇలాంటి అణచివేతల నుంచి బయటపడే దిశగా భారీ మార్పులు తప్పనిసరిగా రావాల్సిందే.

అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతాల్లోని మహిళల్ని చీకట్లో మగ్గిపోయేలా చేసిన బంధనాలను బద్దలు కొట్టేలా చేయడంలో ఆధునిక సాహిత్యం ద్వారా అందివచ్చిన వ్యక్తివాద ఆలోచన, సాంస్కృతిక ఇస్లాంకు సంబంధించిన ఆధునిక వ్యాఖ్యానాలు ఎంతగానో తోడ్పడ్డాయి. మహిళల దీనమైన పరిస్థితులకు ప్రధాన కారణం... పితృస్వామిక దాష్టీక పద్ధతులే. అక్కడి మహిళలది ఎదురుతిరిగే మనస్తత్వం కాకపోవడం కూడా సమస్యకు కొంతమేర కారణంగా మారింది. పితృస్వామిక భావజాలంతో కూడిన, సమాచార వ్యాప్తిపై విధించిన పరిమితులు మార్పులు నిరోధకంగా మారాయి.

వలసలకు యుద్ధమే కారణం...

ప్రజలు తామున్న చోట నుంచి ఇతర సురక్షిత ప్రాంతాలకు వలస బాట పట్టడానికి యుద్ధం కారణమైంది. ఫలితంగా, సనాతన పద్ధతుల నుంచి నూతన ప్రాంతాల్లోని కొత్త జీవనశైలి రూపాల్లోకి మారడానికి అవకాశాలు తెరచుకున్నాయి. కొంతమంది వలస వెళ్లకుండా, తాము బతుకీడుస్తున్న చోటనే ఉండిపోవాలని నిర్ణయించుకుని, తమ సొంత గడ్డలపైనే మార్పులు సాధించారు. మార్పును వ్యతిరేకించే అన్ని శక్తుల్నీ సవాలు చేసి దీన్ని సుసాధ్యం చేశారు. అలాంటి వారిలో మేనా హబీబ్‌ ఒకరు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ పాలన సాగిన కాలంలో ఆమె కాబూల్‌ను విడిచిపెట్టి వెళ్లడానికి ఇష్టపడలేదు. తను కోరుకున్న జీవనశైలితోనే బతకాలని నిర్ణయించుకున్నారు.

స్ఫూర్తినిచ్చిన 'మేనా'

స్వతహాగా తజిక్‌ మహిళ అయిన మేనా అత్యంత మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. అణచివేత సంకెళ్లను తెంచి వేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె నేపథ్యం కూడా మరీ గొప్పదేం కాదు. పేదరికం నుంచే వచ్చారు. తాలిబన్ల పాలనలో ప్రజాక్షేత్రంలో పురుషులతో కలిసి మహిళ పనిచేయడమంటే ఆమె తన చావును కోరితెచ్చుకున్నట్లే. మేనా హబీబ్‌ తన చదువు పూర్తయ్యాక ఓ వార్తా పత్రికలో చేరారు. టీవీలో ఓ కార్యక్రమ ప్రయోక్తగానూ పనిచేశారు. మహిళలంతా బురఖాల్లో ఉండే దేశంలో... ఆమె మేకప్‌ వేసుకోవడం, జీన్స్‌, టాప్‌లు ధరించడం ద్వారా సాహసోపేతమైన సవాలునే విసిరారు. తన జుత్తుకు రంగు సైతం వేసుకొనేవారు. కాబూల్‌ నగరంలోని ప్రధాన ప్రాంతంలో ఉండే తన కార్యాలయానికి వెళ్లేందుకు ఉదయం ఏడు గంటలకే ఇంటి నుంచి బయల్దేరేవారు. ముజాహిదీన్ల నుంచి తాలిబన్లకు, వారి నుంచి అమెరికా అండదండలున్న అష్రఫ్‌ ఘని ప్రభుత్వం వరకు సాగిన ప్రభుత్వాల పాలనలన్నింటినీ ఆమె చూశారు.

స్త్రీ పురుష భేదం..

ప్రస్తుత ప్రభుత్వంతో ఆమెకు సౌకర్యంగానే అనిపిస్తున్నా, ఏ నేత కూడా ఆమెను ప్రభావితం చేయలేకపోయారనే చెప్పొచ్చు. ఆమె తల్లి ఎవరికీ తెలియకుండా సహకారం అందించడం తప్పించి, తన కుటుంబం నుంచి ఏమాత్రం మద్దతు పొందలేకపోయారు. పురుష సహచర ఉద్యోగులతో కలిసి తన కుమార్తె పని చేయడానికి తండ్రి ఎప్పుడూ ఇష్టపడలేదు. ఈ కారణంగానే ఆమె ఇంటికి దూరంగా, కుటుంబ సభ్యుల సహాయసహకారాలు తీసుకోకుండా, కాబూల్‌ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించారు. మహిళలను బురఖా లేకుండా ఆమోదించే పరిస్థితి లేనందున చదువుకొనే సమయంలో మేనా కూడా బురఖా ధరించేవారు. మేనాలాగే చాలామంది అమ్మాయిలు కాబూల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొత్తగా గుర్తించిన స్వాతంత్య్రాన్ని ఆస్వాదిస్తున్నారు. మహిళల కోసం ఇలాంటి మార్పే కొనసాగాలని కోరుకుంటున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని మహిళలు సైతం ఇదేతరహా మెరుగైన జీవితం గడపాలని ఆశిస్తున్నారు. ఇక్కడ వాస్తవికాంశం ఏమిటంటే... ప్రతి మానవ హృదయానికీ ఏదో స్థాయిలో ఆకాంక్షలు ఉంటాయి. ఒకవేళ నియంత్రణలు అనేవే ఉంటే అవి ముసుగు వేసుకున్న వారికీ, అలాంటి బంధనాలేవీ లేనివారికి... ఇద్దరికీ ఉండాలి. లింగం ఆధారంగా దుర్విచక్షణ చూపడానికి వీల్లేదు. జీవితాన్ని, జీవనశైలిని స్త్రీపురుష భేదం నిర్ణయించకూడదు.

-బిలాల్‌ భట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.