శ్రీలంక రాజధాని కొలంబోలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఓ ఉన్మాది అనూహ్యంగా మరో పేలుడులో తన భార్యను, సోదరిని పోగొట్టుకున్నాడు.
షాంగ్రీలా హోటల్లో పేలుళ్లకు పాల్పడ్డది ఆత్మాహుతి దళ సభ్యుడు ఇన్సాన్ సీలవన్ అని పోలీసులు విచారణలో తేల్చారు. అనూహ్యంగా డేమంతగోడలో జరిగిన బాంబు పేలుళ్లలో ఇతని భార్య, సోదరి ప్రాణాలు కోల్పోయారు. కొలంబో ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టుకు ఈ మేరకు పోలీసులు సమాచారం ఇచ్చారు. దాడికి తెగించిన సీలవన్... అవిస్సవెల్లా-వెల్లంపిటియా రోడ్డులోని ఓ ఫ్యాక్టరీ యజమానిగా గుర్తించారు.
ఉత్తర కొలంబోలోని ఓ రెండంతస్థుల భవనంలో తనిఖీలు చేయడానికి పోలీసులు చేరుకోగానే సీలవన్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లలో ఎనిమిదోది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.