ETV Bharat / international

'కరోనా గుట్టు'పై డబ్ల్యూహెచ్​ఓ కీలక ప్రకటన

author img

By

Published : Feb 9, 2021, 4:12 PM IST

Updated : Feb 9, 2021, 4:53 PM IST

కరోనావైరస్.. వుహాన్​లోని ల్యాబ్​నుంచి లీక్ అయి ఉండకపోవచ్చని డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం సభ్యుడు బెన్ ఎంబారెక్ తెలిపారు. వుహాన్​లో కానీ మరేచోటైనా కానీ.. 2019 డిసెంబర్​కు ముందే భారీ స్థాయిలో కరోనా వ్యాపించిందనేందుకు ఆధారాలు లభించలేదని చెప్పారు.

World Health Organisation's team did not find evidence of large outbreaks that could be related to COVID19
'2019 డిసెంబర్​కు ముందే కరోనా వ్యాప్తిపై ఆధారాల్లేవ్'

కరోనా ఆవిర్భావంపై డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం సభ్యుడు పీటర్ బెన్ ఎంబారెక్ కీలక ప్రకటన చేశారు. చైనాలోని వుహాన్ ల్యాబ్​ నుంచి వైరస్ లీక్ అయి ఉండకపోవచ్చని తెలిపారు. ఇతర జంతువుల నుంచే మానవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని పేర్కొన్నారు.

చైనాలోని వుహాన్ నగరం నుంచే కరోనా ఉద్భవించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ దర్యాప్తు చేసిన నిపుణులు.. దీనిపై సమగ్ర వివరాలను వెల్లడించారు బెన్. వుహాన్​లో 2019 డిసెంబర్​కు ముందే కరోనా భారీ స్థాయిలో వ్యాపించిందనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలిపారు. వుహాన్​లో కానీ, మరేచోటైనా కానీ డిసెంబర్​కు ముందే భారీ వ్యాప్తికి జరిగిందనే ఆధారాల్లేవని అన్నారు.

అయితే, 2019 డిసెంబర్​లో వుహాన్ హునాన్ మార్కెట్​ వెలుపల విస్తృత వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు చెప్పారు బెన్.

వుహాన్​లో డబ్ల్యుహెచ్​ఓ చేసిన దర్యాప్తు వల్ల కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయన్న బెన్.. కొవిడ్ ఆవిర్భావానికి సంబంధించిన విషయంలో అస్పష్టత వీడలేదని తెలిపారు.

Last Updated : Feb 9, 2021, 4:53 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.