ETV Bharat / international

వుహాన్​ చేరుకున్న డబ్ల్యూహెచ్​ఓ బృందం

author img

By

Published : Jan 14, 2021, 12:29 PM IST

కరోనా వైరస్​ మూలాలను కనుగొనేందుకు గాను.. డబ్ల్యూహెచ్​ఓకు చెందిన బృందం చైనాలోని వుహాన్​కు చేరుకుంది. 14 రోజుల పాటు క్వారంటైన్​ అనంతరం ఈ బృందం విస్తృత స్థాయి పరిశోధన చేపట్టనుంది.

WHO experts arrived in Wuhan to probe origins of COVID-19 pandemic
వుహాన్​కు చేరుకున్న డబ్ల్యూహెచ్​ఓ బృందం

కరోనా మహమ్మారి పుట్టుకకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) చేపట్టనున్న పరిశోధనలో కీలక ముందడుగు పడింది. డబ్ల్యూహెచ్​ఓకు చెందిన 10 మంది నిపుణులతో కూడిన బృందం.. చైనాలోని వుహాన్​ విమానాశ్రయానికి చేరుకుంది. వుహాన్​ నగరంలో ఈ బృందం పరిశోధన చేపట్టనుంది. అయితే.. ఆ దేశంలోని కొవిడ్​ నిబంధనల ప్రకారం నేటి నుంచి 14 రోజుల పాటు వీరు క్వారంటైన్​లో ఉండాలి.

ఈ క్వారంటైన్​ సమయంలో వైరస్​కు పుట్టుకకు సంబంధించిన పలు విషయాలను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చైనా వైద్య నిపుణులతో డబ్ల్యూహెచ్​ఓ బృందం చర్చించనుంది. అయితే.. కరోనా మూలాలు కనుగొనేందుకు డబ్ల్యూహెచ్​ఓ జరుపుతున్న ఈ పరిశోధన శాస్త్రీయంగా ప్రశ్నార్థకం అని చైనా జాతీయ వైద్య కమిషన్​ పేర్కొంది. ఇదే తరహా పరిశోధనలు అన్ని దేశాల్లోనూ జరగాలని వాదిస్తోంది.

ఇదీ చదవండి:పండుగల వేళ చైనాలో భారీగా కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.