ETV Bharat / international

అఫ్గాన్​లో స్వేచ్ఛకు సంకెళ్లు.. మహిళల మెడపై 'షరియా' కత్తి - అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల షరియా చట్టం అమలు

రెండు దశాబ్దాల పాటు ప్రశాంత జీవితం గడిపిన అప్గాన్​ వాసులు- ఇప్పుడు మళ్లీ తాలిబన్ల రాకతో బెంబేలెత్తిపోతున్నారు. ​​ప్రజలంతా భయవిహ్వలురు కావడానికి ప్రధాన కారణం- తాలిబన్లు ప్రవచిస్తున్న షరియా చట్టం అమలే. ఈ చట్టం అమలుతో ఇన్నాళ్లు తాము అనుభవించిన స్వేచ్ఛా వాయువులు కొల్లబోయి ఇకపై ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ జీవితం గడపాల్సి ఉంటుందన్న చేదు వాస్తవాన్ని తలచుకొని అక్కడి మహిళలు వణికిపోతున్నారు.

Sharia law in afghanistan
అఫ్గానిస్థాన్​లో షరియా చట్టం
author img

By

Published : Aug 20, 2021, 8:31 AM IST

రెండు దశాబ్దాల పాటు ప్రశాంత జీవితం గడిపిన అఫ్గాన్‌వాసులు.. ఇప్పుడు మళ్లీ తాలిబన్లు రావడంతో గుండెలు అరచేతిలో పెట్టుకుని క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నారు. ప్రజలంతా భయవిహ్వలురు కావడానికి ప్రధాన కారణం- వాళ్లు ప్రవచిస్తున్న షరియా చట్టం అమలే. అఫ్గానిస్థాన్‌ను కైవసం చేసుకున్న తరవాత తొలిసారిగా నిర్వహించిన మీడియా సమావేశంలోనే తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్‌ తమ వైఖరిని సుస్పష్టంగా వెల్లడించారు. 'ఇస్లామిక్‌ చట్ట పరిమితులకు లోబడి' తాము మహిళల హక్కులను రక్షిస్తామన్నారు. 1990ల నాటికి, ఇప్పటికి తమ మత విశ్వాసాలలో మార్పేమీ లేకున్నా, అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంత అనుభవం వచ్చిందని మాత్రం చెప్పారు. దీన్నిబట్టే వాళ్లు మహిళలకు ఇవ్వబోయే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఏపాటివో వెల్లడవుతోంది.

కఠిన నిబంధనలు

షరియా అనేది ఇస్లాంలోని చట్టబద్ధమైన విధానం. ఇది కొన్ని నైతిక నిబంధనలతో కూడి ఉంటుంది. రోజువారీ జీవనంతో పాటు మతపరంగా తప్పనిసరిగా చేయాల్సిన పనులు, వ్యక్తిగత నమ్మకాలకు సంబంధించి కూడా ఇందులో కఠినమైన నిబంధనలు ఉంటాయి. కాకపోతే, వివిధ ముస్లిం దేశాలు వీటిని అమలు చేసే తీరు మాత్రం వేర్వేరుగా ఉంటుంది. అఫ్గాన్‌లో ఉన్నంత కఠినమైన శిక్షలు ఇతర దేశాల్లో ఉండవు. ఇందులో నేరాలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించినా, అత్యంత కఠినమైన శిక్షలు ఉండేది మూడోతరహా నేరాల్లోనే. వీటిని దేవుడికి వ్యతిరేకంగా చేసేవని అంటారు. వివాహేతర సంబంధాలు, చట్టవిరుద్ధమైన లైంగిక ప్రవర్తన గురించి చేసే తప్పుడు ఆరోపణలు, మద్యపానం, దొంగతనం, దోపిడీ... వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని స్తంభానికి కట్టేసి కొట్టడం, రాళ్లతో కొట్టి చంపడం, చేతులు లేదా కాళ్లు తొలగించడం, దేశ బహిష్కరణ, మరణ శిక్ష వంటి అత్యంత కఠినమైన శిక్షలను తాలిబన్లు అఫ్గాన్‌ పౌరులకు విధిస్తారు.

అఫ్గాన్​లోనే అత్యంత కఠినంగా..

కొన్ని దేశాల్లో షరియా చట్టం ఉన్నా, అందులోని కొన్ని అంశాలనే అమలు చేస్తున్నారు. కొన్ని ఆఫ్రికన్‌ దేశాల్లోనూ ఈ చట్టం అమలవుతోంది. 2020 సెప్టెంబరు నుంచి సూడాన్‌ దీని అమలును రద్దు చేసింది. 30 ఏళ్ల ఇస్లామిక్‌ పాలనకు తెరదించుతూ, అధికారికంగా లౌకిక దేశంగా మారింది. ప్రపంచంలో అఫ్గానిస్థాన్‌, బహ్రెయిన్‌, బ్రూనై, ఈజిప్టు, ఇండొనేసియా, ఇరాన్‌, ఇరాక్‌, మలేసియా, మాల్దీవులు, మౌరిటేనియా, నైజీరియా, పాకిస్థాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యెమెన్‌ లాంటి పలు దేశాల్లో షరియా చట్టం అమలవుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే, అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు షరియా చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేస్తారు. బహిరంగంగా ఉరి తీయడం, కాళ్లు, చేతులు తొలగించడం, సంగీతం, టీవీ, వీడియోలపై నిషేధం, రోజుకు అయిదుసార్లు నమాజ్‌ చేయని పురుషులను, గడ్డం చేసుకొనే వారిని రాళ్లతో కొట్టడం లాంటివన్నీ చేస్తారు.

ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది..

షరియాను ఈ స్థాయిలో అమలు చేస్తే బాలికలు, మహిళలు చాలా వరకూ ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో, బురఖా ధరించి తమ సమీప బంధువులైన పురుషుల రక్షణతోనే బయటకు అడుగుపెట్టాలి తప్ప సొంతంగా బయటకెళ్లలేరు. చదువుకోవడానికి దాదాపుగా వీలుండదు. బాలురు వెళ్లే మదర్సాలకు, పాఠశాలలకు బాలికలు వెళ్లకూడదు. బ్యాంకులలో పనిచేసే మహిళలను ఇంటిదాకా పురుషులను తోడిచ్చి పంపుతారు. లేదంటే, వారి బదులు వాళ్ల సమీప బంధువుల్లోని పురుషులే ఆ ఉద్యోగాలు చేయాలి. పురుష వైద్యుల వద్ద చికిత్స చేయించుకునే అవకాశం కూడా మహిళలకు ఉండదు. 12 ఏళ్లు దాటిన, తమ కుటుంబసభ్యులు కాని మగవారితో మాట్లాడటానికి వీలుండదు.

నృత్యం చేసినా శిక్షే!

తాలిబన్లు సంగీతాన్ని పూర్తిగా నిషేధించారు. గతంలో వాళ్ల పాలన ఉన్నప్పుడు పార్టీలలో సంగీతం వినిపించినా, నృత్యాలు చేసినా సంబంధిత వ్యక్తులకు శిక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడాలన్నా కొత్తవారికి వినిపించనంత నెమ్మదిగా మాట్లాడాలి. మహిళలు ఎత్తుమడమల చెప్పులు (హై-హీల్స్‌) వేసుకోకూడదు. నడిచేటప్పుడు చెప్పుల నుంచి శబ్దం రాకూడదు. ఇళ్ల వద్ద బాల్కనీల్లోనూ కూర్చోకూడదు. వార్తాపత్రికలు, పుస్తకాలు, పోస్టర్లలో మహిళల చిత్రాలు ప్రచురించడం నిషిద్ధం.

మరోవైపు, అఫ్గాన్‌లో మహిళా జిల్లా గవర్నర్‌గా ఉన్న సలీమా మజారీని తాలిబన్లు బంధించారు. తాలిబన్లపైకి తుపాకి ఎక్కుపెట్టిన చరిత్ర ఆమెది. బల్క్‌ రాష్ట్రంలోని చాహర్‌ కింట్‌ జిల్లాను తాలిబన్ల చేతికి చిక్కకుండా సలీమా గట్టిగా ఎదిరించారు. కానీ, తాలిబన్ల బలం ముందు నిలవలేకపోయారు. సాక్షాత్తు దేశాధ్యక్షుడే ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయినా, ఆమె మాత్రం తన శాయశక్తులా పోరాడారు. చివరికి తాలిబన్లకు బందీగా మారారు. తనకు, తన కుటుంబానికి సహాయం చేసేవాళ్లు ఎవరూ లేరని, ఇక వాళ్లు వచ్చి తనను చంపడం ఖాయమని ఆ దేశంలోని తొలి మహిళా మేయర్‌ జరీఫా ఘఫారీ ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. రెండు దశాబ్దాలపాటు అనుభవించిన స్వేచ్ఛా వాయువులు కొల్లబోయి ఇకపై ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ జీవితం గడపాల్సి ఉంటుందన్న చేదు వాస్తవాన్ని తలచుకొని అఫ్గాన్‌ మహిళలు వణికిపోతుండటం విషాదకరం.

హక్కులపై ఆందోళన

తాలిబన్ల పాలనలో, షరియా చట్టం కఠినంగా అమలైతే అఫ్గాన్‌లో మహిళల పరిస్థితి ఎలా ఉండవచ్చు అనేదాన్ని- ఇటీవల విడుదలైన ఒక వీడియో ఇంటర్వ్యూ కళ్లకు కట్టింది. 'ఈసారి పాలనలో మహిళల హక్కులను పరిరక్షిస్తారా?' అని ఆ వీడియోలో ఒక మహిళా పాత్రికేయురాలు తాలిబన్‌ ఫైటర్లను ప్రశ్నించగా, షరియా చట్టానికి లోబడే హక్కులు ఉంటాయని స్పష్టం చేయడం గమనార్హం. 'మహిళా రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా?' అన్న ప్రశ్నకు సమాధానంగా ఫక్కున నవ్వడంతోపాటు, వీడియో తీయడాన్ని ఆపేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆమె అడిగిన ప్రశ్నకు తమకు నవ్వొచ్చిందంటూ అక్కడున్న ఓ తాలిబన్‌ వ్యాఖ్యానించారు. అఫ్గాన్‌లో రేపటి పరిస్థితికి ఈ వీడియోను సంకేతంగా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సహా అంతర్జాతీయ సమాజం మొత్తం తాలిబన్ల నియంత్రణలోని అఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

- రఘురామ్‌

ఇదీ చూడండి: అఫ్గానీలకు అభయం- తాలిబన్ల కొత్త వ్యూహం

ఇదీ చూడండి: అమెరికా రగిలించిన రావణకాష్ఠం- అఫ్గానిస్థాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.