ETV Bharat / international

కరోనాపై షీ బుకాయింపు- డబ్ల్యూహెచ్​ఓకు ప్రశంస - జిన్​పింగ్ వార్తలు

కరోనా విషయంలో పారదర్శకంగా వ్యవహరించినట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ మరోసారి బుకాయించారు. కరోనాపై పోరులో చైనాతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్రను ప్రశంసించారు. అమెరికా నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూహెచ్​ఓకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టంచేశారు.

VIRUS-CHINA-WHO-XI
జిన్​పింగ్
author img

By

Published : Sep 8, 2020, 1:50 PM IST

Updated : Sep 8, 2020, 2:21 PM IST

కరోనా మహమ్మారి విషయంలో అమెరికా నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ)కు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ మద్దతు తెలిపారు. డబ్ల్యూహెచ్​ఓపై అమెరికా చేస్తోన్న ఆరోపణలను ఖండించారు.

కరోనాపై పోరులో ముఖ్య పాత్ర పోషించినవారి కోసం బీజింగ్​లో మంగళవారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో జిన్​పింగ్ మాట్లాడారు.

"ఈ మహమ్మారి సమయంలో తప్పొప్పులు ఎంచడం, స్వార్థంగా వ్యవహరించటం దేశాన్ని, ప్రజలను బాధించటమే. అన్ని దేశాల ప్రజలకు ఇది హాని కలిగిస్తుంది. కరోనా నియంత్రణకు అంతర్జాతీయంగా కృషి చేస్తోన్న డబ్ల్యూహెచ్​ఓకు మా మద్దతును కొనసాగిస్తాం. "

- షీ జిన్​పింగ్​

మరోసారి బుకాయింపు..

కరోనా వైరస్‌పై చైనా పారదర్శకంగానే వ్యవహరించిందని జిన్‌పింగ్‌ మరోసారి సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు చైనా కృషి చేసిందన్నారు. పలు దేశాలకు భారీగా వెంటిలేటర్లు, పీపీలు, మాస్కులు అందించామని గుర్తుచేశారు. కరోనా సంక్షోభ సమయంలో మొదట సానుకూల వృద్ధిరేటు పొందిన ప్రధాన ఆర్థిక వ్యవస్థ కూడా చైనాయే అని చెప్పారు జిన్​పింగ్.

కరోనాపై పోరులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, వైద్యులకు 'పీపుల్స్ హీరో' పురస్కారాన్ని ప్రకటించారు. 2002 సమయంలో వ్యాప్తి చెందిన సార్స్​ వ్యాధి నియంత్రించటంలో ప్రముఖ పాత్ర పోషించిన వైద్యులు జాంగ్​ నాన్​షాంగ్​కు దేశ అత్యున్నత పురస్కారం 'మెడల్​ ఆఫ్ ద రిపబ్లిక్'ను అందిస్తున్నట్లు తెలిపారు.

చైనాపై ఆరోపణలు..

చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అంతకంతకూ విజృంభిస్తూ ఎంతో మంది ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. కాగా, అప్పటి నుంచి ఆ వైరస్‌ చైనా చేసిన పనే అంటూ అమెరికా సహా పలు ప్రపంచ దేశాల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది.

ఈ విషయంలో డబ్ల్యూహెచ్​ఓ కూడా చైనాకు సహకరించిందని అమెరికా ఆరోపించింది. ఆ సంస్థ నుంచి వైదొలిగింది ట్రంప్ ప్రభుత్వం.

ఇదీ చూడండి: కరోనా విలయం-9 లక్షలకు చేరువలో మరణాలు

Last Updated : Sep 8, 2020, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.