ETV Bharat / international

Most expensive tea powder: కిలో టీ పొడి రూ.పదికోట్లు - మనోహరి గోల్డ్‌ స్పెషాలిటీ టీ పొడి ధర ఎంత?

మన దగ్గర మంచి టీ పౌడర్‌ కిలో రూ. ఆరువందల నుంచి వెయ్యి వరకూ ఉంటుంది. మరి మీకు తెలుసా.. మన దేశంలోనే డార్జిలింగ్‌లో పండించే ఒక రకం టీ పొడి ధర కిలో రూ.1.3 లక్షలని. అయ్యబాబోయ్‌ అనిపిస్తోంది కదూ.. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఖరీదైన టీ పొడులు(most expensive tea world) మరికొన్ని ఉన్నాయి. వీటిలో డా హాంగ్‌ పావొ అనే టీ పొడి అత్యధికంగా కిలో రూ.పదికోట్లు పలుకుతుంది.

tea
టీ పొడి
author img

By

Published : Nov 21, 2021, 10:37 AM IST

వర్షాకాలంలో గరం గరం చాయ్‌ తాగుతుంటే.. ఎంత హాయిగా ఉంటుందో. మరి, వాతావరణం చల్లగా ఉన్న సమయంలో ఇష్టమైన అల్లం టీనో గ్రీన్‌ టీనో ఆస్వాదిస్తూ ఖరీదైన ఆ టీల వెనక ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..

డా హాంగ్‌ పావొ టీ.. కిలో రూ.10 కోట్లు!

tea
డా హాంగ్‌ పావొ టీ

చైనాలోని వుయి పర్వతాల మీద పెరిగే డా హాంగ్‌ పావొ రకం టీ పొడి బంగారం కంటే ఎన్నో రెట్లు ఖరీదైంది(most expensive tea in china) తెలుసా.. ఈ తేయాకు ఒక్క గ్రాము రూ.లక్ష పైనే(da hong pao 1kg price) పలుకుతుంది మరి. పూర్వం స్థానిక చక్రవర్తి అనారోగ్యంతో బాధపడుతుంటే ఓ సన్యాసి ఈ తేయాకులతో టీ చేసి తాగించాడట. వెంటనే ఆయన కోలుకున్నాడట. అప్పట్నుంచీ దీన్ని సంజీవనిలా భావిస్తారు స్థానికులు. పర్వతం పై భాగంలోని ఔషధ మొక్కలను దాటుకుని సున్నపు రాతి కొండల మీదుగా ప్రవహించే నీరు ఈ టీ చెట్లకు ఎన్నో ఔషధ గుణాలను తెచ్చిపెడుతుంది. అందుకే, ఎంత నీరసంగా ఉన్నవారైనా డా హాంగ్‌ పావొ టీని(da hong pao tea) తాగితే ఉత్సాహంగా లేచి తిరుగుతారట. ఈ టీలో ఉండే సుగుణాలు ఉబ్బసం, ఊబకాయం, కాళ్ల వాపుల్లాంటి సమస్యలనూ మద్యం, ధూమపానం వల్ల కలిగే దుష్ప్రభావాలనూ దూరం చేస్తాయి. అయితే, అత్యుత్తమమైన హాంగ్‌ పావొ తేయాకు వందల ఏళ్ల నుంచీ ఉన్న తల్లి చెట్ల నుంచే లభిస్తుంది. అలాంటివి ప్రస్తుతం కేవలం ఆరు చెట్లే ఉన్నాయట. మిగిలినవన్నీ ఆ చెట్ల నుంచి అంటు కట్టినవీ వాటి విత్తనాల నుంచీ పెంచినవే. అందుకే, తల్లి చెట్టు నుంచి తీసిన టీపొడి ఖరీదు చాలా ఎక్కువ. 20గ్రాముల ఈ పొడిని ఆమధ్య వేలంలో పెడితే, 20లక్షలకు అమ్ముడు పోయింది. అరుదుగా దొరుకుతుంది కాబట్టి దీన్ని చైనా జాతీయ సంపదగా కూడా ప్రకటించింది.

పాండా డంగ్‌ టీ.. కిలో ధర రూ.52లక్షలు!

tea
పాండా డంగ్‌ టీ...

చైనాకు చెందిన అన్‌ యన్షి అనే వ్యాపారి పాండాల వ్యర్థాలను ఎరువుగా వేసి ఈ కొత్తరకం తేయాకుల(panda dung tea price) పెంపకాన్ని మొదలుపెట్టాడు. పాండాల ప్రధాన ఆహారం వెదురు మొక్కలే. కానీ అవి తినే ఆహారంలో కేవలం 30శాతాన్ని మాత్రమే అరిగించుకుంటాయి. మిగిలిందంతా వ్యర్థంగా మారిపోతుంది. ఇకపోతే వెదురు మొక్కలు క్యాన్సర్లను రానివ్వవు. గుండె, జీర్ణవ్యవస్థకు(panda dung tea benefits) మంచిదట. కాబట్టి పాండాల వ్యర్థాలతో పండించే ఈ తేయాకుతో చేసిన టీ ఆరోగ్యానికి మంచిదట.

గ్యొకురొ టీ.. కిలో 10.7 లక్షలు!

tea
గ్యొకురొ టీ

జపాన్‌లోని ఉజి, యామె ప్రాంతాల్లో పండించే ఈ గ్రీన్‌ టీ(gyokuro tea price) రకం అస్సలు చేదు లేకుండా తియ్యగా ఉంటుందట. ఈ టీ ఆకులను కోసే 20 రోజుల ముందు వాటిమీద ఎండ పడకుండా తెరలు కడతారు. దాని వల్ల వాటిలో అమైనో ఆసిడ్లు, థయనిన్‌, ఆల్కలాయిడ్‌ కెఫీన్‌(gyokuro tea benefits) పెరగడంతో పాటు తియ్యదనం వస్తుందట.

ఎల్లో గోల్డ్‌ టీ బడ్స్‌... కిలో రూ.6 లక్షలు!

tea
ఎల్లో గోల్డ్‌ టీ బడ్స్‌

సింగపూర్‌కి చెందిన టీడబ్ల్యూజీ(twg tea company) కంపెనీ ఓ పర్వతం మీద పండించే ఈ టీ(yellow gold tea buds price) పంటను ఏడాదికి ఒక్కసారి మాత్రమే కోస్తారట. అది కూడా బంగారు కత్తెరలతో మొక్క చివర ఉండే మొగ్గల వరకే కత్తిరిస్తారు. తర్వాత ఎండలో ఆరబెట్టి 24క్యారెట్ల బంగారంతో ఆకుల మీద స్ప్రే చేస్తారు. ఈ తేయాకులతో పెట్టిన టీ ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికీ చాలా మంచిదట.

సిల్వర్‌ టిప్స్‌.. కిలో రూ.1.3 లక్షలు!

tea
సిల్వర్‌ టిప్స్‌

బంగాల్‌లోని డార్జిలింగ్‌లో పండించే 'సిల్వర్‌ టిప్స్‌ ఇంపీరియల్‌' టీ (silver tips imperial tea) మన దేశంలోనే ఖరీదైన టీగా పేరుపొందింది. స్థానిక ప్రాచీన టీ ఎస్టేట్‌లలో ఒకటైన 'మకైబరి' (makaibari tea estate) పండించే ఈ టీ పంటను అనుభవజ్ఞులైన పనివాళ్లు పౌర్ణమి రోజు రాత్రి మాత్రమే కోస్తారు. దీనివల్ల తేయాకుల్లోని ఔషధ గుణాలు మరింత పెరుగుతాయట. ఇక, మామిడి పండు, దేవగన్నేరు పూల సువాసనలతో నోరూరించే ఈ తేయాకుల పరిమళాలు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు సూర్యోదయానికి ముందే ప్యాకింగ్‌ కూడా చేసేస్తారు. ప్రతిసారీ పంటను కోసేముందు పాటలూ డ్రమ్ములు వాయించడం, కోలాటాల్లాంటి వాటితో ఆధ్యాత్మిక వేడుకలను కూడా నిర్వహిస్తారిక్కడ. ఆ సమయంలో ఈ చోటు పర్యటకులతో కిక్కిరిసిపోతుంది.

tea
మనోహరి గోల్డ్‌ స్పెషాలిటీ టీ

మన దేశంలోనే అసోంలోని డిబ్రూగర్‌ జిల్లాలో పండించే మనోహరి గోల్డ్‌ స్పెషాలిటీ టీ పొడి(manohari gold tea assam) ధర కూడా ఎక్కువే. కిలో రూ.75వేలు మరి. ఈ తేయాకులను వేసవి ముందు వచ్చే పంటలో కోస్తారు. ఉదయాన్నే ఎండ రాని సమయంలో అత్యుత్తమంగా ఉండే మొగ్గలను చేత్తో కోసి పొడిని తయారు చేస్తారు. దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువట అందుకే, అంత ధర(manohari gold tea price) పలుకుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.