ETV Bharat / international

అఫ్గాన్​లో కీలక ప్రాంతాన్ని ఖాళీ చేసిన అమెరికా

అఫ్గానిస్థాన్​లో తమ బలగాలకు కేంద్ర బిందువుగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న కీలక ఎయిర్​ఫీల్డ్​ను దాదాపు 20 ఏళ్ల తర్వాత ఖాళీ చేసింది అమెరికా. అఫ్గాన్​ రక్షణ శాఖకు అప్పగించినట్లు అగ్రరాజ్య అధికారులు తెలిపారు. అయితే.. బలగాలను తరలిస్తున్నప్పటికీ వాయుదాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

America troops in Afghanistan
అఫ్గాన్​లోని అమెరికా బలగాలు
author img

By

Published : Jul 2, 2021, 12:20 PM IST

Updated : Jul 2, 2021, 12:26 PM IST

అఫ్గానిస్థాన్​లోని తమ బలగాల తరలింపును ముమ్మరం చేసింది అమెరికా. తాలిబన్లు, అల్​ఖైదా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రధాన కేంద్రంగా చేసుకున్న బగ్రామ్​ ఎయిర్​ఫీల్డ్​ను.. సుమారు 20 ఏళ్ల తర్వాత ఖాళీ చేసింది.

బగ్రామ్​ ఎయిర్​ఫీల్డ్​ను అఫ్గాన్​ జాతీయ భద్రతా, రక్షణ బలగాలకు అప్పగించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే.. బలగాల రక్షణకు అఫ్గాన్​లోని అమెరికా టాప్​ కమాండర్​ జనరల్​ ఆస్టిన్​ ఎస్​ మిల్లర్​ అన్ని అధికారాలను కలిగి ఉన్నారని చెప్పారు.

కీలక ఎయిర్​ఫీల్డ్​ నుంచి బలగాల తరలింపు.. సెప్టెంబర్​ 11 లోపు పూర్తిస్థాయిలో సైన్యం ఉపసంహరణకు అగ్రరాజ్య అధ్యక్షుడు జోబైడెన్​ ఇచ్చిన హామీని సూచిస్తోంది. ప్రస్తుతం అక్కడ 2,500-3,500 వరకు అమెరికా బలగాలు ఉన్నట్లు సమాచారం. అయితే.. చివరి సైనికుడిని ఎప్పుడు తరలిస్తారనే అంశంపై ఎలాంటి స్పష్టత నివ్వలేదు అమెరికా. కాబుల్​ హమిద్​ కర్జాయ్​ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతపై చర్చలు కొనసాగుతున్నాయని, భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఎయిర్​పోర్టుకు టర్కీ, అమెరికా సైనికులు పహారా కాస్తున్నారు.

వాయుదాడులు కొనసాగుతాయ్​!

బలగాలు ఉపసంహరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. సెప్టెంబర్​ వరకు 20 ఏళ్లుగా కొనసాగుతున్న అఫ్గాన్​ వార్​లో అమెరికా సైన్యం కలుగజేసుకుంటుందని స్పష్టం చేశారు అధికారులు. అఫ్గాన్​ దళాలను రక్షించేందుకు తాలిబన్లపై వాయుదాడులు చేసే అంశం అందులో ఒకటని తెలిపారు. మరో వారం రోజుల్లో పెద్ద ఎత్తున బలగాల తరలింపు జరుగుతుందన్నారు. అమెరికా టాప్​ కమాండర్​ జనరల్​ స్కాట్​ మిల్లర్​ అఫ్గాన్​ నుంచి బయలుదేరిన తర్వాత.. ఉగ్రవాద నిరోధక చర్యలను మెరైన్​ జనరల్​ ఫ్రాంక్​ మెక్​కెంజియా చేపడతారని సమాచారం.

ఇదీ చూడండి: అఫ్గాన్​లోని అమెరికా బలగాల ఉపసంహరణ షురూ!

Last Updated : Jul 2, 2021, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.