ఉత్తర కొరియా ఇటీవల చేపడుతున్న వరుస క్షిపణి ప్రయోగాలపై (North Korea missile test) అమెరికా, ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అధునాతన సాంకేతికతలో ఉత్తర కొరియా పురోగతిని చూసి.. అత్యవసరంగా ఆంక్షలు (North Korea UN sanctions) విధించాలని ఐరాసను కోరాయి. సైనిక కార్యక్రమాలతో పాటు, ఆర్థిక కార్యకలాపాలపైనా ఆంక్షలు (North Korea sanctions) అమలు చేయాలని పేర్కొన్నాయి.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై (North Korea missile test 2021) ఐరాసలో అంతర్గతంగా చర్చ జరిగింది. అంతకుముందు విలేకరులతో మాట్లాడిన అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్... ఉత్తర కొరియా (North Korea news) నిర్లక్ష్యపు పోకడలను మానుకోవాలని హెచ్చరించారు. ఎలాంటి షరతులు లేకుండా బైడెన్ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించాలని సూచించారు. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని హితవు పలికారు.
"ఉత్తర కొరియా పట్ల తమకు(అమెరికాకు) ఎలాంటి శత్రుత్వం లేదు. ఆ దేశ అధికారులతో చర్చలు జరిపేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఎలాంటి ముందస్తు షరతులు విధించకుండా బైడెన్ యంత్రాంగంతో చర్చలు ప్రారంభించాలి. నిధులు, సాంకేతికత అందకుండా.. కొరియాపై ఆంక్షలు విధించాలని ఐరాసను కోరుతున్నాం."
-లిండా గ్రీన్ఫీల్డ్, అమెరికా రాయబారి
మరోవైపు, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఈస్తోనియా దేశాలు సైతం.. కొరియా క్షిపణి ప్రయోగాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల చేపట్టిన సబ్మెరైన్ క్షిపణి ప్రయోగం.. ఆ దేశ రెచ్చగొట్టే చర్యలను సూచిస్తోందని వ్యాఖ్యానించాయి. అణు సామర్థ్యాలు పెంచుకొని సముద్రతలంపైనా పట్టు పెంచుకోవాలని ఉత్తరకొరియా భావిస్తోందని అన్నాయి. ఈ నేపథ్యంలో.. కొరియా తన చర్యలకు అడ్డుకట్ట వేసి, బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలను సైతం నిలిపివేయాలని స్పష్టం చేశాయి. అమెరికా, దక్షిణ కొరియా చర్చల ప్రతిపాదనలను ఆమోదించాలని కోరాయి..
ఇదీ చదవండి: కొరియా సొంత రాకెట్ ప్రయోగం- ఫలిస్తే చరిత్రే!