పవిత్ర ఈస్టర్ రోజున శ్రీలంకలో జరిగన మారణహోమాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయివారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
దేశంలో నెలకొన్న భయానక పరిస్థితుల నుంచి శ్రీలంక త్వరగా బయటపడాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఐరాస పేర్కొంది.
ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చిలు, స్టార్ హోటళ్లు లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు రెచ్చిపోయాయి.
ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో 215 మందికి పైగా మృతి చెందగా... 600 మందికిపైగా గాయాలపాలయ్యారు.