ETV Bharat / international

Taliban News: అఫ్గాన్​లో బాలికల విద్యకు వీడనున్న గ్రహణం! - బాలికల విద్యకు ఓకే చెప్పిన తాలిబన్లు

అఫ్గాన్​లో తాలిబన్​లు (Taliban News) అధికారం చేపట్టాక బాలికల విద్యపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బాలికలను సెకండరీ స్కూలింగ్​కు(Girl Education In Afghanistan) అనుమతించనున్నట్లు ఐరాస సీనియర్​ అధికారి ఒకరు ప్రకటించారు. ఈ విషయంపై తాలిబన్​ ప్రభుత్వం త్వరలోనే కార్యచరణ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

Taliban to announce secondary school for girls
బాలికల విద్య
author img

By

Published : Oct 16, 2021, 3:21 PM IST

అఫ్గానిస్థాన్​లో బాలికల విద్యకు(Girl Education In Afghanistan) త్వరలోనే అనుమతి లభించనున్నట్లు ఐక్యరాజ్య సమితి సీనియర్​ అధికారి ఓమర్​ అబ్దీ ప్రకటించారు. ఈ విషయాన్ని తాలిబన్​ (Taliban News) ప్రభుత్వమే తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని వెల్లడించారు.

యూనిసెఫ్​ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా​ విధులు నిర్వహిస్తున్న ఓమర్​ అబ్దీ.. గతవారం కాబుల్​లో పర్యటించారు. ఈ క్రమంలో తాలిబన్​ విద్యాశాఖమంత్రితో మాట్లాడినట్లు తెలిపారు. బాలికల విద్యకు (Girl Education In Afghanistan) అనుమతి ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు మంత్రి తనతో చెప్పిట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కార్యచరణను త్వరలోనే వారు ప్రకటించనున్నారని అన్నారు. అఫ్గాన్​లోని మొత్తం 34 ప్రావిన్స్​ల్లో ఐదింటిలో ఇప్పటికే బాలికలను సెకండరీ స్కూలింగ్​ అనుమతిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: కత్తిదాడిలో ఎంపీ మృతి- అందరూ చూస్తుండగానే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.