ETV Bharat / international

ఫిలిప్పీన్స్​లో 'రాయ్​' బీభత్సం- 112కు చేరిన మృతులు

Typhoon Rai in Philippines: ఫిలిప్పీన్స్​లో రాయ్​ తుపాను సృష్టించిన బీభత్సానికి మృతుల సంఖ్య వంద దాటింది. ఒక్క బోహోల్​ ప్రావిన్స్​లోనే 63 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందిపై తుపాను ప్రభావం పడినట్లు ప్రభుత్వం తెలిపింది. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.

typhoon rai in philippines
ఫిలిప్పీన్స్​లో 'రాయ్​' బీభత్సం
author img

By

Published : Dec 19, 2021, 11:55 AM IST

Updated : Dec 19, 2021, 1:18 PM IST

Typhoon Rai in Philippines: రాయ్​ తుపాను బీభత్సంతో ఫిలిప్పీన్స్​ కోలుకోలేని స్థితికి చేరింది. రెండే రోజుల్లో యావత్​ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. మరోవైపు.. తుపాను ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 100 దాటింది. పలువురి ఆచూకీ గల్లంతైంది.

typhoon rai in philippines
వరదలో కొట్టుకుపోతున్న వారిని కాపాడుతున్న సహాయక బృందం

ఒక్క బోహోల్​ ప్రావిన్స్​లోనే 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గవర్నర్​ ఆర్థుర్​ యాప్​ ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశారు. మరో 10 మంది ఆచూకీ గల్లంతైందని, 13 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. సమాచార వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో 48లో 33 నగరాల మేయర్లు మాత్రమే సమాచారం ఇచ్చారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నిరాశ్రయులకు ఆహారం, మంచినీళ్లు వంటివి తక్షణమే అందించాలని ఆదేశించారు.

మరోవైపు.. తుపాను కారణంగా 7,80,000 మంది ప్రభావితమైనట్లు ఫిలిప్పీన్స్​ ప్రభుత్వం తెలిపింది. అందులో 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లో 39 మంది చనిపోయినట్లు జాతీయ పోలీస్​, విపత్తు స్పందనా దళం తెలిపింది. మొదటగా తీరాన్ని తాకిన డినగాట్​ ఐలాండ్స్​ ప్రావిన్స్​లో 10 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 112కి చేరింది.

ఫిలిప్పీన్స్​ ప్రెసిడెంట్​ రొడ్రిగో డుటెర్టే పలు ప్రాంతాలను సందర్శించారు. 2 బిలియన్​ పెసోస్​(40 మిలియన్​ డాలర్లు) సాయం ప్రకటించారు. 270 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయటం వల్ల 227 నగరాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆదివారం నాటికి కేవలం 21 నగరాల్లోనే పునరుద్ధరణ జరిగింది.

ఇదీ చూడండి: Philippines Typhoon: ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం.. 19 మంది మృతి

Last Updated : Dec 19, 2021, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.