ETV Bharat / international

ఆ కుక్కలకు యజమానుల నుంచే కరోనా సోకింది

మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి మూగజీవాలనూ వదలట్లేదు. మనుషులకు సోకిన వైరస్​.. వారు పెంచుకునే జంతువులకూ వ్యాపిస్తోంది. హాంకాంగ్‌లో రెండు పెంపుడు కుక్కలకు వాటి యజమానుల ద్వారానే కరోనా సోకిందని పరిశోధకులు గుర్తించారు.

two dogs test corona positive in hongkong
కుక్కలకు సోకిన కరోనా.. యజమానులే కారణం!
author img

By

Published : May 17, 2020, 7:31 AM IST

హాంకాంగ్‌లో కరోనా సోకిన రెండు కుక్కలకు వాటి యజమానుల ద్వారానే వైరస్‌ వ్యాపించిందని పరిశోధకులు గుర్తించారు. ఆ కుక్కలు, వాటి యజమానుల్లోని వైరస్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ కుక్కల నుంచి ఇతర కుక్కలకు లేదంటే మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని వీరు వెల్లడించారు.

కొవిడ్‌-19 బాధితుల నుంచి కుక్కలకు ఈ వైరస్‌ వ్యాపిస్తుందని స్పష్టమైనప్పటికీ అందుకుగల అవకాశాలు చాలా తక్కువని వీరు స్పష్టంచేస్తున్నారు. వ్యాధి బాధితులతో కలిసి ఉన్న 15 కుక్కల్లో కేవలం రెండింటికి మాత్రమే ఈ వైరస్‌ సోకిందని నెదర్లాండ్స్‌ వైద్యులు తమ అధ్యయనంలో గుర్తించారు.

భవిష్యత్తులో తలెత్తే ముప్పులను నివారించాలంటే.. పెంపుడు జంతువుల మధ్య వైరస్‌ వ్యాప్తిపై కూలంకషంగా అధ్యయనం చేయాలని మరికొందరు పరిశోధకులు స్పష్టంచేస్తున్నారు. హాంకాంగ్‌లో ఈ రెండు కుక్కలతో పాటు, ఓ పిల్లి, న్యూయార్క్‌లో రెండు పిల్లులు, జంతు ప్రదర్శనశాలలోని 4 పులులు, 3 సింహాలు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

అలానే పిల్లులపై నిర్వహించిన సర్వేలో.. ఇవి లక్షణాలు లేకుండా ఇతర పిల్లులకు ఈ వ్యాధిని వ్యాప్తి చేయగలవని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వ్యాధి బాధితులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి:గొడవ పడిన భార్యాభర్తలను ఒక్కటి చేసిన 'లాక్​డౌన్​ జర్నీ'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.