మయన్మార్ వాయుసేనకు చెందిన ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు స్థానిక మీడియా గురువారం కథనం వెలువరించింది. మండలయ్లోని అనిసాకన్ అనే గ్రామం వద్ద ఉన్న కొండప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది.
ప్రమాద సమయంలో విమానంలో 16 మంది ఉన్నారని స్థానిక అగ్నిమాపక శాఖ చెప్పింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: myanmar: మయన్మార్ నిరసనల్లో 840 మంది మృతి