టర్కీ-సిరియాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రరూపం దాల్చాయి. నిన్న సిరియా సేనలు చేసిన దాడికి గానూ టర్కీ ప్రతీకార చర్యలకు దిగింది. అందులో భాగంగా టర్కీ.. 16 మంది సిరియా సైనికులను కాల్చిచంపింది. తాజాగా రసాయన ఆయుధ స్థావరాన్ని కూడా ధ్వంసం చేసింది. అలెప్పొ నగరానికి దక్షిణంగా 13 కిలోమీటర్ల దూరంలో ఈ రసాయన ఆయుధ స్థావరం ఉన్నట్లు టర్కీ అధికారులు తెలిపారు. మరికొన్ని కీలక ప్రాంతాలపై కూడా తమ సైన్యం దాడులు చేస్తున్నట్లు వారు చెప్పారు.
రాజకీయ పరిష్కారం దిశగా..
తాజా సంఘటన ద్వారా అంకారా, మాస్కోల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒప్పందంలో భాగంగా అంకారా.. ఈ ప్రావిన్సులో 12 పరిశీలన పోస్టులను ఏర్పాటు చేయగా.. సిరియా దళాలు, రష్యా మద్దతుతో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సిరియా తిరుగుబాటు సమూహాలకు మద్దతిచ్చే టర్కీ మిత్రపక్షమైన రష్యా, సిరియా వివాదానికి రాజకీయ పరిష్కారం దిశగా ముందడుగేస్తున్నాయి.
ఇదీ చదవండి: ఆ రాజు 'ఇగో' వల్లే... ఫిబ్రవరికి తక్కువ రోజులు!