ETV Bharat / international

ఇప్పటికీ ఒప్పందానికి అమెరికా సిద్ధమే: ట్రంప్ - అమెరికా

జీ-20 సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సమావేశమయ్యారు. వాణిజ్య ఒప్పందంపై ట్రంప్​ సానుకూలంగా స్పందించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుందని జిన్​పింగ్​తో ట్రంప్​ వ్యాఖ్యానించారు.

అమెరికా-చైనా
author img

By

Published : Jun 29, 2019, 10:21 AM IST

చైనాతో వాణిజ్య ఒప్పందానికి సుముఖంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పష్టం చేశారు. వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు కృషి చేయాల్సిందేనని పేర్కొన్నారు. జీ-20 సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​తో జరిగిన భేటీలో పలు అంశాలపై ట్రంప్ మాట్లాడారు.

అమెరికా-చైనా చర్చలు

"మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. మన మధ్య మంచి అనుబంధం ఉంది. వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మనం ఏదైనా చేయాలి. నాకు తెలిసి ముగింపునకు మనం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనం సరైన దిశగా ఒప్పందం కుదుర్చుకుంటే చరిత్రలో నిలిచిపోతాం. ఒప్పందం విషయంలో అమెరికా పారదర్శకంగా ఉంది. ఇది ఎంతో కీలకమైన సమావేశం. రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిద్దాం. ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి: అనైతిక ఆంక్షలపై త్రైపాక్షిక పోరు

Bijapur (Chhattisgarh), June 28, ANI: Three Central Reserve Police Force (CRPF) soldiers were killed in an encounter with Naxals in Chhattisgarh's Bijapur today. One civilian also lost his life and another was injured in the encounter. The gun fight took place near Keshkutul village when a joint team of the CRPF and local police was out on an area domination operation. A reinforcement team of security forces have been sent to the area.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.