ETV Bharat / international

బస్సును ఢీకొన్న రైలు.. 12మంది మృతి - రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంతో రైలును ఢీకొన్న బస్సు

బంగ్లాదేశ్​లో బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 12 మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వేగేటు వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

12 killed, 6 injured as train hits bus in Bangladesh
బంగ్లాదేశ్​లో బస్సును ఢీకొన్న రైలు.. 12మంది మృతి
author img

By

Published : Dec 19, 2020, 7:54 PM IST

బంగ్లాదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్​ వద్ద పట్టాలు దాటుతున్న బస్సును రైలు ఢీకొని 12 మంది మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. రైల్వే క్రాసింగ్​ వద్ద సిబ్బంది లేకపోవటం, గేటు తీసి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నారు.

రాజ్​సాహి-ప్రతిభాపుర్​ల మధ్య నడిచే ఉత్తర ఎక్స్​ప్రెస్​ రైలు.. జోయ్​పురాత్​ జిల్లాలోని పురాణాపోలి రైల్వే క్రాసింగ్​ దాటుతున్న బస్సును వేగంగా వచ్చి ఢీకొట్టింది. సుమారు అర్ధ కిలోమీటర్​ వరకు బస్సును లాక్కెళ్లింది. దీంతో ప్రాణ నష్టం అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 8 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించగా.. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి మరో 10 మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు. కాపలాలేని రైల్వే క్రాసింగ్​లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలాంటి ప్రమాదాలు పెరిగాయని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.

ఇదీ చదవండి: మాపై మెరుపుదాడులకు భారత్ ప్రణాళిక: పాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.