రైలు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ రవాణా మంత్రి వినూత్నంగా ఆలోచించారు. ఈ ఏడాది ఆరంభంలో సిడెన్హామ్ రైల్వేస్టేషన్లో ఓ బాలుడికి తప్పిన పెను ప్రమాద వీడియోను టీవీల్లో ప్రసారం చేస్తూ... అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్లాట్‌ఫాం నుంచి రైలు ఎక్కే సమయంలో పిల్లలు ప్రమాదాలకు గురయ్యే ఆవకాశముందని... తల్లిదండ్రులు పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదలొద్దని చెబుతున్నారు.
న్యూ సౌత్‌వేల్స్‌లో ఏడాది కాలంలో 200 మంది చిన్నారులు రైలు ప్రమాదాల్లో గాయపడ్డారు.
సిడెన్హామ్ రైల్వేస్టేషన్లో బాలుడికి తప్పిన పెను ప్రమాదం
ఈ ఏడాది ఆరంభంలో సిడెన్హామ్ రైల్వేస్టేషన్లో ఓ బాలుడు మృత్యుఒడి నుంచి బయటపడ్డాడు. ప్లాట్‌ఫాంపై తల్లితో పాటు వేచి చూసిన బుడతడు.. ట్రైన్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు రైలుకు-ప్లాట్‌ఫాంకు మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో పడిపోయాడు. అది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే బాలుడిని పైకి తీశారు. ఎలాంటి ప్రాణహాని జరగకుండా చూశారు.