రూబిక్స్ క్యూబ్ ఉత్పత్తి మొదలై 40ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. జపాన్‌లో అతి చిన్న రూబిక్స్ క్యూబ్‌ను అమ్మకానికి ఉంచారు. డిసెంబర్లో దీన్ని డెలివరీ చేయనున్నారు. ఈ ఆట వస్తువు 1,98,000 యెన్లు లేదా 1,900 డాలర్లు ధరకు అందుబాటులో ఉంది.
ఈ రూబిక్స్ పరిమాణం కేవలం 9.9 మిల్లీ మీటర్లు లేదా 0.39 అంగుళాలు. దీని బరువు కేవలం 2 గ్రాములు. దీనిని 'అల్ట్రా-ప్రెసిషన్ మెటల్'తో తయారు చేసినట్లు టోక్యోకు చెందిన బొమ్మల తయారీ సంస్థ బందాయ్ తెలిపింది.
రూబిక్స్‌ను 1970లో హంగేరియన్ వాస్తుశిల్పి ప్రొఫెసర్ ఎర్నో రూబిక్ కనుగొన్నారు. 1980 నుంచి ఓ అమెరికా సంస్థ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. రెండేళ్లలోనే 100 మిలియన్ల రూబిక్స్ అమ్ముడవగా... జపాన్‌లో కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే 40 లక్షల రూబిక్స్ అమ్ముడయ్యాయి.
ఈ సూపర్-స్మాల్ రూబిక్స్ క్యూబ్‌ను టోక్యోలో ప్రదర్శనకు ఉంచారు. ఇది నవంబర్ 9 వరకు కొనసాగుతుంది.
ఇదీ చూడండి: హింసాత్మకంగా టేలర్ నిరసనలు.. ఇద్దరికి గాయాలు