టర్కీ- ఇస్తాంబుల్‌లోని హాజియా సోఫియాలో నిర్వహించిన ప్రార్థనల్లో వేలాదిమంది ముస్లింలు పాల్గొన్నారు. 86ఏళ్లపాటు క్రైస్తవ మతాలకు నిలయమైన ఈ కేథడ్రల్‌లను.. ముస్లింలు ఇటీవలికాలంలో మసీదులు, మ్యూజియంలుగా మార్చారు.
భారీ స్థాయిలో నిర్వహించిన ఈ నమాజ్ ప్రారంభ వేడుకల్లో ఆ దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ పాల్గొన్నారు. ఆరో శతాబ్దానికి చెందిన ఓ చారిత్రక మసీదులో సుమారు 500మందితో కలిసి ప్రార్థనలు చేశారు ఎర్డోగాన్. ఈ సందర్భంగా టర్కీ ఇస్లామిక్ ఉద్యమంలో యువత కల నెరవేరిందని ఆయన పేర్కొన్నారు.
తొలిసారిగా నిర్వహించిన ఈ ప్రార్థనల్లో పురుషులతో సహా మహిళలు పాల్గొన్నారు. ఫలితంగా సోఫియా ప్రాంతమంతా ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది.
ఇదీ చదవండి: 'కరోనా కుట్ర'పై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు