బొరోలూలా, గ్రోట్ ద్వీపాల మధ్య తుఫాను తీరం దాటనుందని ఒక రోజు ముందుగానే బ్యూరో ఆఫ్ మెట్రాలజి సంస్థ అంచనా వేసింది. తుపాను ప్రభావం ఉండే తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించారు అధికారులు.
నేటి ఉదయం 9:50 గంటల సమయంలో ఉత్తర భూభాగంలోని ప్రాంతంలో ట్రెవర్ తుపాను తీరం దాటినట్టు అధికారులు తెలిపారు. తీరప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించినట్లు చెప్పారు. తీవ్రమైన గాలుల కారణంగా భద్రతా హెచ్చరికలు జారీ చేశారు.
ట్రెవర్తో పాటు ఆస్ట్రేలియాను తాకిన మరో తుపాను వెరోనికా. వాయువ్య ఆస్ట్రేలియా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.
ఇదీ చూడండీ:'ఇదాయ్' ప్రకోపం-150 మంది బలి