ETV Bharat / international

Russia-Ukraine conflict: అసలు పోరు పట్టణాల్లో మొదలు! - రష్యా దాడులు

Russia-Ukraine conflict: దాడులు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే రష్యా సాయుధ వాహనాలు సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోని కీలక నగరాలకు చేరుకొన్నాయి. కానీ, ఇక్కడ వారికి అసలైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్‌ నగర వాసులు కూడా రష్యా దళాలపై ఆగ్రహంగా ఉండటంతో వారే ఆయుధాలు పట్టారు. దీనికి తోడు నాటో బలగాలు చిన్న ఆయుధాలను ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ప్రధాన నగరాలు రష్యాకు కొరకరాని కొయ్యగా మారతాయి.

Russia-Ukraine conflict
అసలు పోరు పట్టణాల్లో మొదలైంది..
author img

By

Published : Feb 28, 2022, 6:54 AM IST

Russia-Ukraine conflict: ఉక్రెయిన్‌ సారవంతమైన నేలలతో కూడిన మైదాన ప్రాంతం. రష్యా నుంచి ఆక్రమణలను అడ్డుకొనే ప్రకృతి సహజమైన పర్వతాల వంటి అడ్డుకట్టలు లేవు. దీంతో దాడులు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే రష్యా సాయుధ వాహనాలు సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోని కీలక నగరాలకు చేరుకొన్నాయి. కానీ, ఇక్కడ వారికి అసలైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్‌ నగర వాసులు కూడా రష్యా దళాలపై ఆగ్రహంగా ఉండటంతో వారే ఆయుధాలు పట్టారు. దీనికి తోడు నాటో బలగాలు చిన్న ఆయుధాలను ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ప్రధాన నగరాలు రష్యాకు కొరకరాని కొయ్యగా మారతాయి. దీంతో ఇరుపక్షాలు భారీగా ఆస్తిప్రాణ నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది.

నగరాల స్వాధీనం కష్టం..

ఇటీవల కాలంలో నగరాల స్వాధీనం కోసం జరిగే పోరాటాలు కొన్ని నెలల పాటు కొనసాగిన సందర్భాలను మనం చూశాము. ప్రభుత్వాలను కూలదోయడానికి నగరాలను స్వాధీనం చేసుకొంటుంటారు. ముఖ్యంగా రెబల్స్‌ ఆధీనంలోని 2014లో డాన్‌బాస్‌ ప్రాంతంలోని ఇలోవైస్క్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉక్రెయిన్‌ దళాలకు దాదాపు 50 రోజులు పట్టింది. 2016 అక్టోబర్‌ నుంచి ఇరాక్‌లోని మొసూల్‌ స్వాధీనం చేసుకొవడానికి అమెరికా సంకీర్ణ దళాలు 2017 జనవరి వరకు పోరాడాల్సి వచ్చింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

నగర రక్షణ కోసం పోరాడే దళాలకు పట్టణాలు అనువైన ప్రాంతాలు. అంటే పెద్దగా బలం లేకపోయినా పోరాడాలనే కసి ఉన్నవారికి అనువుగా ఉంటుంది. దీంతో దాడి చేయడానికి వచ్చేవారు భారీ ఎత్తున సాయుధ వనరులను తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండే నిర్మాణాలు సైనిక స్థాయి డిఫెన్సివ్‌ పొజిషన్లను అందిస్తాయి. ఈ కారణంతోనే కీవ్‌లోకి ఇప్పటికీ రష్యా సేనలు చొచ్చుకుపోలేకపోతున్నాయి.

ఇంటెలిజెన్స్‌లో ఆధిక్యం: దాడి చేయడానికి బయట నుంచి వచ్చేవారి ఇంటెలిజెన్స్‌ను పట్టణప్రాంతాలు కుదించేస్తాయి. దీంతోపాటు నిఘా, పర్యవేక్షణలు కూడా వారికి కష్టంగా ఉంటాయి. అటాకర్స్‌ వైమానిక ఆస్తులు కచ్చితత్వంతో పనిచేయడం కష్టం. అంతేకాదు.. సుదూరంగా సురక్షిత ప్రాంతంలో ఉండి లక్ష్యాలపై దాడి చేయడం ఇక్కడ సాధ్యం కాదు. ఆధునిక సైన్యాలు వాడే ఆయుధాల్లో చాలా వరకు సుదూరం నుంచి లక్ష్యాలు ఛేదించేవే.

శత్రువు కదలికలపై కన్ను: నగర రక్షణకు పోరాడే బృందాలు దాడికి వచ్చిన వారి కదలికలను స్పష్టంగా గమనించే పొజిషన్లలో ముందు నుంచే ఉంటాయి. దాడి చేసేందుకు బయట నుంచి వచ్చేవారు దాడులను తప్పించుకోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. అందుకే రష్యా సైన్యం కీవ్‌ స్వాధీనం కోసం పట్టణ పోరాటాల కోసం డిజైన్‌ చేసిన బీఎంపీటీ-72 సాయుధ వాహనాలు పంపుతోంది. వీటిని టీ-72 ట్యాంక్‌ల నుంచి అభివృద్ధి చేశారు.

నగరాలు పూర్తిగా కాంక్రీట్‌ నిర్మాణాలతో నిండిపోయి ఉంటాయి. దీంతో నగర రక్షణ దళాలకు ఇవి సైనిక బంకర్ల వలే రక్షణ ఇస్తాయి. ఆక్రమణదారులు ఈ భవనాలను మొత్తం తనిఖీలు చేస్తూ ప్రతిఘటన లేకుండా చూసుకొంటూ ముందుకెళ్లాలి. అదే ప్రభుత్వ భవనాలు, పారిశ్రామిక భవనాల్లోని బలమైన ఇనుప నిర్మాణాలు ఆయుధాలకు తొందరగా దెబ్బతినవు. నగర రక్షణ దళాలు వీటిని ఆసరాగా చేసుకొని దాడులు చేసే అవకాశాం ఉంది. పట్టణ పోరాటాల్లో పేలుడు పదార్థాలు వాడటానికి పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటాయి.

పట్టణాల్లో నిర్మించిన భూగర్భ బంకర్లు, సొరంగాల్లో నగర రక్షణ దళాలు దాక్కొని ఆక్రమణదారులపై దాడులు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇరాక్‌, సిరియా, తూర్పు ఉక్రెయిన్లో ఈ రకమైన పోరాటాలు జరిగాయి.

చిన్న ఆయుధాలు భారీ ముప్పు..

ఇప్పటికే ఉక్రెయిన్‌ వాసులకు ప్రభుత్వం భారీ ఎత్తున చిన్న ఆయుధాలు సరఫరా చేసింది. ఫలితంగా ఇప్పుడు కీవ్‌లో క్రెమ్లిన్‌ ప్లాన్‌ పూర్తి స్థాయి ఫలితాలు ఇవ్వడంలేదు. రష్యా దళాలు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నాయి. పశ్చిమ దేశాలు వేల సంఖ్యలో యాంటీ ట్యాంక్‌, స్టింగర్‌ శ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు తరలిస్తున్నాయి. హఠాత్తుగా దాడులు చేయడానికి చిన్న ఆయుధాలు అనువుగా ఉంటాయి. సోవియట్‌ సేనలను అఫ్గానిస్థాన్‌ను ఓడించడానికి అమెరికా అక్కడి ముజాహిద్దీన్‌లకు భారీగా చిన్న ఆయుధాలనే ఇచ్చింది. ఓ రకంగా తాజాగా ఉక్రెయిన్‌లో అదే వ్యూహం అనుసరిస్తోంది.

  • తాజాగా జర్మనీ 1000 యాంటీ ట్యాంక్‌, 500 స్టింగర్‌ శ్రేణి క్షిపణులను సరఫరా చేసింది.
  • బెల్జియం శనివారం 2,000 మిషిన్‌ గన్స్‌ను ఉక్రెయిన్‌కు తరలించింది.
  • డచ్‌ ప్రభుత్వం స్నిప్పర్‌ రైఫిల్స్‌, 200 స్టింగర్‌ శ్రేణి విమాన విధ్వంసక క్షిపణులు పంపింది.
  • చెక్‌ రిపబ్లిక్‌ 30,000 పిస్తోళ్లు, 7,000 అసాల్ట్‌ రైఫిల్స్‌, 3,000 మిషిన్‌ గన్స్‌, డజన్ల కొద్దీ స్నిప్పర్‌ గన్స్‌, పదిలక్షల కార్ట్‌రిడ్జ్‌లు తరలించింది.
  • అమెరికా 350 మిలియన్‌ డాలర్ల సాయం అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారీ సంఖ్యలో జావెలిన్‌ క్షిపణలను తరలించింది.

జావెలిన్‌కు భారీగా డిమాండ్‌..

ఉక్రెయిన్‌లో అత్యంత డిమాండ్‌ ఉన్న ఆయుధంగా జావెలిన్‌ క్షిపణులు ఉన్నాయి. 2018లో ఒక బ్యాచ్‌ను కొనుగోలు చేసింది. ఇది పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ క్షిపణి. ఐదు కిలోమీటర్ల దూరంలోని ట్యాంకులు, సాయుధ వాహనాలను ఇది ధ్వంసం చేస్తుంది. పదాతి దళాలు వీటిని తేలిగ్గా తరలించగలవు. ఇప్పటికే పలు యుద్ధాల్లో జావెలిన్‌ సత్తా నిరూపించుకొంది. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌, సిరియాల్లో జరిగిన పట్టణ యుద్ధాల్లో దీనిని విపరీతంగా వాడారు. పట్టణ వీధుల్లోకి చొరబడిన రష్యా ట్యాంకుల ధ్వంసానికి అత్యంత అనువుగా ఉంటాయి.

  • అమెరికాకు చెందిన రేథియాన్‌-లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థలు సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి.
  • ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండోనేషియా, తైవాన్‌, యూకే, ఎస్తోనియా, లిథువేనియా సహా మొత్తం 20 దేశాలు వీటిని వాడుతున్నాయి.
  • 2.5 కిలోమీటర్ల రేంజిలో జావెల్‌ 'డైరెక్ట్ అటాక్‌'‌,'టాప్‌ అటాక్‌' అనే రెండు మోడ్‌లలో పనిచేస్తుంది. దీనిని హెలికాప్టర్లు, డ్రోన్లపై కూడా వాడొచ్చు. ట్యాంకులు, ఆర్మ్‌ర్డ్‌ వెహికల్స్‌ను టాప్‌ మోడ్‌లో వాడి ధ్వంసం చేయవచ్చు.
  • కేవలం ఇద్దరు సైనికులు కలిసి దీనిని వాడొచ్చు. దీనికి థర్మల్‌ ఇమేజర్‌ కూడా అమర్చారు.

భారీ ప్రాణనష్టం ముప్పు..

సాధారణ ప్రజలు ఈ పోరాటాల్లో తీవ్రంగా నష్టపోనున్నారు. ఇరాక్‌, సిరియా యుద్ధాల్లో 70 శాతం ప్రాణ నష్టం పట్టణాల్లో చోటు చేసుకొంది. ఈ ప్రాణ నష్టంలో కూడా 90శాతం భారీ బాంబులు, క్షిపణులు, శతఘ్నులు వాడకం కారణంగా చోటు చేసుకొంది. పైగా వీటిల్లో అత్యధికం రష్యా బలగాలే వాడటం గమనార్హం. ఇప్పటికే రష్యా వేగు బృందాలు కీవ్‌లోని కొన్ని ఇళ్లను వైమానిక దాడులకు లక్ష్యంగా మార్కింగ్‌ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

ఇదీ చూడండి:

ఉక్రెయిన్​ కొత్త వ్యూహం.. పుతిన్​ 'అణు' ప్రకటనపై నాటో ఆందోళన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.