భారత్ సహా ఇతర దేశాలతో తాలిబన్లలు సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి జైబుల్లా ముజాహిద్ అన్నారు. భారత్‌తో స్నేహపూరిత సంబంధాలు కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అఫ్గాన్ మట్టిని మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి తాము అనుమతించబోమని స్పష్టం చేశారు.
"ఆసియాలోని ముఖ్యమైన దేశాల్లో భారత్ ఒకటి. మేము ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాము. అలాగే మిగతా దేశాలతో కూడా తాలిబన్లు సత్సంబంధాలు కొనసాగించాలని భావిస్తోంది. అఫ్గాన్ ప్రజల ప్రయోజనాల మేరకు భారత్ తన విధానాన్ని రూపొందించాలని మేము కోరుతున్నాం."
---బైబుల్లా ముజాహిద్, తాలిబన్ అధికార ప్రతినిధి.
సమస్యల పరిష్కారానికి భారత్, పాకిస్థాన్‌లు కూర్చుని చర్చించుకోవాలని బైబుల్లా చెప్పారు. పొరుగు దేశాలుగా ఒకరి ప్రయోజనాలు మరొకరి మీదా ఆధారపడి ఉంటాయని అభిప్రాయపడ్డారు.
'రాబోయే రోజులు మరీ దారుణం..'
మరోవైపు రాబోయే రోజుల్లో అఫ్గాన్‌లో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయని ఐక్యరాజ్యసమితిలోని శరణార్థుల విభాగం తెలిపింది. కేవలం కొన్ని నెలల రోజుల్లోనే..అఫ్గాన్ నుంచి 5లక్షలకుపైగా ప్రజలు వలస వస్తారని అంచనా వేసింది. ఇప్పటికే వివిధ దేశాల్లో శరణార్థులుగా 2.2 మిలియన్ మంది అఫ్గాన్లు ఉన్నారని పేర్కొంది. ఎక్కువ మంది పాకిస్థాన్, ఇరాన్లో ఉంటున్నట్లు వివరించింది.
ఇదీ చూడండి: kabul airport blast: 'అఫ్గాన్‌లో పరిస్థితులు ఆందోళనకరం'