అఫ్గానిస్థాన్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు తాలిబన్లు ఆదివారం తెలిపారు. ఈ మేరకు అఫ్గాన్‌లోని కీలక నేతలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.
"కాబుల్‌లోని నేతలతో మా రాజకీయ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. వారి అభిప్రాయాలు కూడా ముఖ్యమే. అల్లా దయతో త్వరలోనే నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటిస్తాం."
-జబీహుల్లా ముజాహిద్, తాలిబన్ల ప్రతినిధి
అయితే ఈ భేటీలపై పలువురు అఫ్గాన్ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ ప్రక్రియలో అందరినీ కలుపుకొని వెళ్లాలని, తాలిబన్ల చర్చలు మాత్రం అఫ్గానీలను అగౌరపరిచేలా.. వ్యక్తుల కేంద్రంగా సాగుతున్నాయని విమర్శిస్తున్నారు.
కాగా, ఇప్పటికే తాలిబన్లు కాబుల్‌ను తమ అధీనంలోకి తీసుకొని వారం గడుస్తోంది. నాటి నుంచి వారి అరాచక పాలనకు భయాందోళనలో ఉన్న ప్రజలు దేశం విడిచి వెళ్లడానికి నానాయాతన పడుతున్నారు(Afghan crisis). పలు దేశాలు తమ పౌరులు సహా అఫ్గానీలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇదీ చూడండి: Afghan crisis: 'దేశం వీడి వెళ్తారా? కాల్చి పడేస్తాం!'