ETV Bharat / international

యుద్ధం లేకుండానే తాలిబన్ల వశమైన ఈశాన్య అఫ్గాన్ - ఈశాన్య అఫ్గానిస్థాన్

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోతుండటం వల్ల తాలిబన్ల హవా మళ్లీ మొదలైంది. ఈశాన్య రాష్ట్రమైన బదక్షన్​లోని పలు ప్రాంతాలు వారి చేతిలోకి వెళ్లాయి. అఫ్గాన్​ సైన్యం ప్రతిఘటించకపోవడం వల్ల యుద్ధం లేకుండానే ఆ ప్రాంతాలు కైవసమయ్యాయి.

northeast afghanistan, అఫ్గానిస్థాన్​ వార్తలు
తాలిబన్ల వశమైన ఈశాన్య అఫ్గాన్
author img

By

Published : Jul 5, 2021, 8:43 AM IST

Updated : Jul 5, 2021, 11:56 AM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాలను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు తాజాగా ఈశాన్య అఫ్గాన్​లోని బదక్షన్​లోని చెందిన పలు ప్రాంతాలను వశం చేసుకున్నారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో పలు అఫ్గాన్​ దళాలు సరిహద్దు దాటి తజికిస్థాన్​లో ఆశ్రయం పొందాయి. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. సుమారు 300 మంది సైనికులు శనివారం సాయంత్రం 6.30 గంటలకు సరిహద్దు దాటారని పేర్కొన్నారు.

బదక్షన్​లోని అనేక ప్రాంతాలు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్ల వశం అయ్యాయని అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల్లో 10 జిల్లాలను తాలిబన్లు ఆక్రమించగా అందులో 8జిల్లాలు.. యుద్ధం లేకుండానే తాలిబన్ల అధీనంలోకి వెళ్లాయని పేర్కొన్నారు. సైన్యానికి సరైన వనరులు లేకపోవడం వల్లే తాలిబన్లు ఆక్రమించగలిగారని తెలిపారు.

ఇదీ చదవండి : బలగాల ఉపసంహరణతో పెనుముప్పుగా తాలిబన్లు!

Last Updated : Jul 5, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.