ETV Bharat / international

ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు- పంజ్​షేర్ నేతకు చోటు! - అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం

అఫ్గానిస్థాన్​లో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా తాలిబన్లు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్‌ ఫైటర్లు.. అంతర్యుద్ధం తలెత్తకుండా పలువురు నేతలతో చర్చలు కొనసాగిస్తున్నారు. అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, ముఖ్యనేత అబ్దుల్లా అబ్దుల్లా సహా ఎనిమిది మంది కీలక నేతలను ప్రభుత్వంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారిలో పంజ్‌షేర్‌ యువనేత మసూద్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

TALIBAN GOVT FORMATION
ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు
author img

By

Published : Aug 26, 2021, 2:57 PM IST

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరూ ఉండరు. అఫ్గాన్‌ను వశం చేసుకున్న తాలిబన్లు(afghanistan taliban) సైతం ప్రస్తుతం ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. గత తప్పులు పునరావృతం కాకుండా పటిష్ఠమైన ప్రభుత్వాన్ని(taliban government news) ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇంతకాలం శత్రువులుగా ఉన్న కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. కాబుల్‌ను ఆక్రమించిన నాటి నుంచి అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, మరో కీలక నేత డాక్టర్‌ అబ్దుల్లా అబ్దుల్లా, ఫజల్‌ హది మస్లిమయర్‌ సహా పలువురితో తాలిబన్లు పలుమార్లు భేటీ అయ్యారు.

అయితే.. నేతలందరినీ కలుపుకొని సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తాలిబన్లకు.. అది అంత సులభంగా ఏమీ లేదని తెలుస్తోంది. ప్రస్తుతం పైచేయి సాధించినా.. భవిష్యత్‌లో ఉజ్బెక్‌, తాజిక్‌లు, హజారాల నుంచి ప్రతిఘటన ఎదురు కాకుండా ఉండేందుకు ప్రభుత్వంలో కీలక నేతలు అసరమని తాలిబన్లు గ్రహించారు. ఈమేరకు సీనియర్ నేతలు సహా ఆయా జాతుల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.

శత్రువులతోనూ భేటీ

మాజీ ప్రధాన మంత్రి, హిజ్-ఇ-ఇస్లామీ అగ్రనేత గుల్బుద్దీన్ హెక్మత్యార్... అఫ్గానిస్థాన్​లో పరిస్థితులను బట్టి తాలిబన్లతో మెలుగుతూ వస్తున్నారు. అల్‌ఖైదాతో సన్నిహత సంబంధాలు కలిగి ఉన్నారు. పాకిస్థాన్‌ గూఢచార సంస్థలతో పరిచయాలు ఆయన్ను కీలకంగా మార్చాయి. ప్రస్తుతం తాలిబన్లు... ఆయనతో చర్చలు జరుపుతున్నారు. తమ శత్రువైన మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తోనూ తాలిబన్లు భేటీ అవుతున్నారు. అష్రఫ్ ఘనీ(Ashraf Ghani) దేశం విడిచి పారిపోయిన సమయంలో.. ఓ వీడియోలో మాట్లాడిన ఆయన దేశంలో ఉండాలనే సంకల్పాన్ని తెలిపారు. అఫ్గానిస్థాన్‌ మాజీ సీఈఓ, కీలక నేత డాక్టర్‌ అబ్దుల్లా అబ్దుల్లా గతంలో ఉత్తర కూటమి నాయకుడు. అబ్దుల్లా రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసినా పీఠం దక్కలేదు. ప్రస్తుతం శాంతియుతంగా అధికార మార్పిడి కోసం తాలిబన్లతో ఆయన చర్చలు జరుపుతున్నారు.

ఉజ్బెక్ నాయకుడు, మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తుమ్... గతంలో తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చికిత్స పేరుతో టర్కీలో కొన్ని సంవత్సరాలు ఉన్న ఆయన... చివరకు అఫ్గాన్ చేరారు. తాలిబన్ల రాకతో మళ్లీ దేశం విడిచి వెళ్లారు. దోస్తూమ్‌ను సైతం ప్రభుత్వంలోకి తీసుకోవాలని ముష్కరులు భావిస్తున్నారు.

సలేహ్​, మసూద్​తో చర్చలు!

ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌తో కూడా మంతనాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అష్రఫ్ ఘనీ పలాయనం తర్వాత తనను తాను అధ్యక్షునిగా ప్రకటించుకున్న అమ్రుల్లా తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2017లో ఘనీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన్ను చంపేందుకు తాలిబన్లు చాలా సార్లు ప్రయత్నించారు. ప్రస్తుతం పంజ్​షేర్‌లో ఉన్న సలేహ్‌... తాలిబన్లకు వ్యతిరేక దళ అధినేత మసూద్​తో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సలేహ్‌ను కూడా ప్రభుత్వంలోకి తీసుకుంటే భవిష్యత్‌లో అంతర్యుద్ధం సమస్య ఉత్పన్నం కాదని తాలిబన్లు అంచనా వేస్తున్నారు. కాబుల్‌కు అందని ద్రాక్షగా ఉన్న పంజ్‌షేర్ ప్రావిన్స్‌లోనూ పాగా వేసేందుకు తాలిబన్లు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ ప్రాంత అధినేత 32 ఏళ్ల అహ్మద్‌ మసూద్‌(ahmad massoud panjshir)తో కూడా తాలిబన్లు చర్చలు జరుపుతున్నారు.

ఉత్తర బల్ఖ్ ప్రావిన్స్ గవర్నర్​గా 2018 వరకు పనిచేసిన మహమ్మద్ నూర్... తాజిక్ వర్గం నాయకుడు. తాలిబన్ల ముఖ్య శత్రువుల్లో నూర్ ఒకరు. తాలిబన్ల ఆక్రమణలు మొదలైన వేళ వారిపై పోరాటానికి పిలుపునిచ్చిన ఆయన.. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మాజీ ఉపాధ్యక్షుడు, హజారా జాతికి చెందిన వ్యక్తి మహ్మమద్ కరీం ఖలీల్​పై కూడా.. తాలిబన్లు దృష్టిసారించారు. తాలిబన్ల ఆక్రమణ అనంతరం.. 71 ఏళ్ల ఖలీల్ పాకిస్థాన్ వెళ్లారు. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు శత్రువులు, సీనియర్ నేతలను కలుపుకొని వెళ్లాలని భావిస్తున్న తాలిబన్ల ఆలోచనలకు మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.