ETV Bharat / international

మహిళలపై తాలిబన్ల ఉక్కుపాదం- ఏకంగా ఆ శాఖనే..!

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మహిళలకు వ్యతిరేకంగా మరో వివావాదాస్పద నిర్ణయం తీసుకున్నారు(taliban women news). మహిళా మంత్రిత్వ శాఖను తీసేసి, ఆ స్థానంలో వైస్ అండ్​ వర్చ్యూ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.(taliban women rights)

afghan women
అఫ్గాన్​ మహిళలు
author img

By

Published : Sep 18, 2021, 5:59 PM IST

అఫ్గాన్​లో అధికారాన్ని చేపట్టిన తాలిబన్లు(Afghanistan Taliban).. మహిళలపై కఠిన వైఖరి అవలంబిస్తూనే ఉన్నారు(taliban women rights). మహిళల చదువుకు, ఉద్యోగాలకు అనేక ఆంక్షలు విధిస్తున్న తాలిబన్లు.. శనివారం ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖనే ఎత్తేశారు. ఆ స్థానంలో 'వైస్ అండ్​ వర్చ్యూ మంత్రిత్వ శాఖ' ను తీసుకొచ్చింది. ఇందులో సభ్యులంతా పురుషులే ఉన్నారు.(taliban women news)

1990 నాటి తాలిబన్ల పాలనను ఈ తాజా చర్యలు గుర్తుకు తెస్తున్నాయి. అయితే.. మహిళల కోసం మరో మంత్రిత్వ శాఖ ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అన్నదానిపై ఈ కొత్త మంత్రిత్వ శాఖలోని సభ్యులు.. ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

మరోవైపు అఫ్గాన్​లో.. ప్రపంచ బ్యాంకు చేపట్టిన 100మిలియన్​ డాలర్ల మహిళ ఆర్థిక సాధికారత, గ్రామీణాభివృద్ధి కార్యక్రమం కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుంది! అక్కడి సిబ్బంది అఫ్గాన్​ను విడిచి వెళ్లిపోవడమే ఇందుకు కారణం.

అమ్మాయిలు ఇళ్లకే!

తాలిబన్ల పాలనలో బాలికలు, మహిళలు ఇళ్లకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన నెలకొంది(taliban girls education). ఈ ఆందోళనలకు మరింత బలం చేకూర్చే విధంగా ఇటీవలే తాలిబన్లు మరో నిర్ణయం తీసుకున్నారు. 6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు శనివారం నుంచే క్లాసులకు హాజరుకావాలని ఆదేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది విద్యాశాఖ.

శుక్రవారం ఈ ప్రకటన ఫేస్​బుక్​లో దర్శనమిచ్చింది. అబ్బాయిల గురించే ఇందులో ఉంది. అమ్మాయిల గురించి ఎలాంటి ప్రకటన లేదు(taliban education news). మార్గదర్శకాల్లోనూ వారి ప్రస్తావన లేకపోవడం.. బాలికలు, మహిళలపై కఠిన ఆంక్షలు ఉంటాయన్న వాదనలకు మరింత ఊతమిస్తోంది.

గత తాలిబన్ల పాలనలో ఇటువంటి కఠిన వైఖరే ఉండేది. అయితే అప్పుడు కనీసం 1-6 తరగతుల బాలికలను చదువుకోనిచ్చేవారు. ఆ తర్వాత పాఠశాలలు, పని ప్రదేశాల్లోకి వారికి అనుమతులు లేవు. అఫ్గాన్​లోని కొన్ని రాష్ట్రాల్లో అనేకమంది మహిళలు ఇప్పటికీ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆసుపత్రి, విద్య, ఆరోగ్యశాఖలో పనిచేసే కొందరికి మాత్రమే అనుమతులుండేవి.

ఇదీ చూడండి: Massoud Afghan: తాలిబన్లను ఢీకొట్టేందుకు భారత్​ సాయం కోరిన మసూద్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.