ETV Bharat / international

Afghan Taliban: 'అవన్నీ తిరిగిచ్చేయండి'.. పౌరులకు తాలిబన్ల ఆర్డర్ - అఫ్గానిస్థాన్​లో మహిళలపై వేధింపులు

అఫ్గాన్​ ప్రజలకు తాలిబన్లు(Afghanistan Taliban).. కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాలు సహా ఇతర ప్రభుత్వ ఆస్తుల్ని వారంలోగా తిరిగిచ్చేయాలని డెడ్​లైన్​ విధించారు.

అఫ్గానిస్థాన్​ తాలిబన్లు
author img

By

Published : Aug 29, 2021, 11:48 AM IST

Updated : Aug 29, 2021, 12:03 PM IST

అఫ్గానిస్థాన్​ ప్రజలకు తాలిబన్లు (Afghanistan Taliban) డెడ్​లైన్​ విధించారు. సంక్షోభ సమయంలో చేజిక్కించుకున్న ప్రభుత్వ ఆస్తులు, ఆయుధాలు, వాహనాలు, మందుగుండు సామగ్రిని వారంలోగా తమకు అప్పగించాలని ఆదేశించారు. లేదంటే చట్టపర చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

ఆగస్టు 15న అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ(Ashraf Ghani) పరారీతో.. అఫ్గానిస్థాన్​ మొత్తం తాలిబన్ల(Taliban news) అధీనంలోకి వచ్చింది. ప్రావిన్సులను ఒక్కొక్కటిగా ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రక్షణ, భద్రత కరవై.. ప్రభుత్వ ఆస్తులపై పడ్డారు స్థానికులు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా ఇతరత్రా ఎత్తుకెళ్లారు. ఇప్పుడు.. వాటన్నింటినీ తిరిగిచ్చేయాలని తాలిబన్లు స్పష్టం చేశారు.

''కాబుల్​లోని ప్రజలందరి కోసం ఓ ప్రకటన. వాహనాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర ప్రభుత్వ ఆస్తులు కలిగిఉన్న వారంతా.. సంబంధిత శాఖలు, కార్యాలయాలకు వాటిని అప్పగించాలి. చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవాలంటే.. వారంలోగా పని పూర్తిచేయాలి.''

- జబీహుల్లా ముజాహిద్​, తాలిబన్ల ప్రతినిధి

కొద్దిరోజుల ముందు కూడా తాలిబన్లు(Taliban latest news) ఇలాంటి ప్రకటనే చేశారు. కానీ.. అప్పుడు ఆయుధాల గురించి మాత్రమే ప్రస్తావించారు.

''తమ భద్రత కోసం ఉంచుకున్న ఆయుధాలను వెంటనే అప్పగించాలి. ఇప్పుడు మీ భద్రత మా బాధ్యత.''

- తాలిబన్లు

దేశం తాలిబన్ల చేతుల్లోకి వచ్చిన అనంతరం.. అఫ్గానిస్థాన్​లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయం(Kabul airport) వద్ద పేలుళ్లు, తొక్కిసలాటలు, కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు 200 మందికిపైగా మరణించారు.

మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్లు ప్రకటించినా.. మహిళల్ని వేధిస్తున్నారని, హజారా వర్గంపై దాడులు చేస్తున్నారని కథనాలు వచ్చాయి.

శరణార్థులుగా 5 లక్షల మంది..

అఫ్గాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో.. వచ్చే 4 నెలల్లో 5 లక్షలకుపైగా అఫ్గాన్ ప్రజలు దేశం విడిచివెళ్లిపోతారని అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ(యూఎన్​హెచ్​సీఆర్​).

శరణార్థుల కోసం.. అఫ్గాన్​ సమీప దేశాలు తమ సరిహద్దులను తెరిచే ఉంచాలని విజ్ఞప్తి చేశారు యూఎన్​హెచ్​సీఆర్​ డిప్యూటీ హై కమిషనర్​ కెల్లీ క్లెమెంట్స్​.

ఇవీ చూడండి: Kabul Airport: అఫ్గాన్​లో మళ్లీ పేలుళ్లకు అవకాశం.. అమెరికా హెచ్చరిక

Panjshir Valley: 'పంజ్​షేర్​లోకి తాలిబన్లా? ఒక్కరూ అడుగుపెట్టలేదు!'

Last Updated : Aug 29, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.