ETV Bharat / international

అఫ్గాన్​లో తాలిబన్ల దాడి.. 10 మంది సైనికులు మృతి - అఫ్గాన్​లో తాలిబన్ల దాడి.. 10 మంది సైనికులు మృతి

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మరో సారి సైనిక స్థావరంపై బాంబు దాడికి తెగబడ్డారు. 10 మంది సైనికులను పొట్టన బెట్టుకున్నారు.

afghan
అఫ్గాన్​లో తాలిబన్ల దాడి.. 10 మంది సైనికులు మృతి
author img

By

Published : Dec 28, 2019, 5:04 PM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ హెల్​మండ్​ రాష్ట్రంలోని సైనిక స్థావరంలో బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది అఫ్గాన్​ సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

ఇదీ జరిగింది

సంగిన్​ జిల్లాలోని సైనిక స్థావరంలో ఓ సొరంగాన్ని తవ్వి అందులో బాంబు పేల్చినట్లు ఓ సైనిక ప్రతినిధి తెలిపారు. బాంబు దాడి అనంతరం తాలిబన్లు అఫ్గాన్​ సైనికుల మధ్య కాల్పులు జరిగాయి.

"సైనిక స్థావరంలో 18 మంది సైనికులు పహారా కాస్తున్నారు. బాంబు దాడిలో 10 మంది మరణించగా నలుగురు సైనికులు గాయపడ్డారు. మరో నలుగురు తాలిబన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. "

-నవాబ్​ జద్రాన్​, సైనిక ప్రతినిధి

దాడి మేమే చేశాము

ఈ దుశ్చర్యకు తాము బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు తాలిబన్లు. మంగళవారం ఉత్తర బల్క్​ రాష్ట్రంలోనూ ఏడుగురు అఫ్గాన్​ సైనికులను పొట్టన బెట్టుకున్నారు తాలిబన్లు.

ఇదీ చూడండి : సోమాలియాలో కారు బాంబు పేలి 73 మంది మృతి

New Delhi, Dec 28 (ANI): Union Minister of Finance Nirmala Sitharaman held a pre-budget meeting in Delhi on December 28. She met the chiefs of public sector banks. Several key issues including prospects of launch of RuPay credit cards were discussed in the meeting. The launch of RuPay credit cards was recently announced by State Bank of India.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.