ETV Bharat / international

Afghan Taliban: మహిళలకు ఇక నరకమే- ట్రైలర్​ చూపించిన తాలిబన్లు - అఫ్గాన్ న్యూస్

అఫ్గానిస్థాన్​లో తాము అధికారం చేపట్టాక 1990ల నాటిలా మహిళల అణచివేత ఉండదని మాటిచ్చిన తాలిబన్లు(Afghan Taliban) వాస్తవానికి అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవరిస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందే మహిళా హక్కులను(Afghan Women Rights) ఒక్కొక్కటిగా కాల రాస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలసి చదువకోకుండా కో-ఎడ్యుకేషన్​పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు బోధించేందుకు పురషులకు అనుమతి లేదని చెబుతున్నారు. టీవీ, రేడియో ఛానళ్లలో మహిళలు పాడటానికి అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో అఫ్గాన్​ మహిళలు తాలిబన్ల రాజ్యంలో గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతున్నారని స్పష్టమవుతోంది. మళ్లీ పాత రోజులొస్తాయేమోనని వారు బిక్కుబిక్కుమంటున్నారు.

Taliban ban Co-education In Afghanistan. Prohibit Men From Teaching Girls
మహిళా హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్న తాలిబన్లు
author img

By

Published : Aug 30, 2021, 2:08 PM IST

ఆగస్టు 15న అఫ్గానిస్థాన్​ను తమ అధీనంలో తెచ్చుకున్న తాలిబన్లు(Afghan Taliban).. 31 తర్వాత ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. తమ పాలనలో మహిళలకు సమాన హక్కులు(Afghan Women Rights) ఉంటాయని, 1990నాటిలా అణచివేత ఉండదని హమీ ఇచ్చారు. అయితే తాలిబన్లు అధికారికంగా అఫ్గాన్​ పగ్గాలు చేపట్టకముందే మహిళల హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నారు. వారు చేస్తున్న ప్రకటనలు మున్ముందు మహిళలు ఎదుర్కోబోయే గడ్డు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

కో- ఎడ్యుకేషన్​పై నిషేధం..

అప్గాన్ మహిళల ఉన్నత విద్యకు అనుమతిస్తామని చెప్పిన తాలిబన్లు(Taliban News).. కో-ఎడ్యుకేషన్​పై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇకపై యూనివర్సిటీలలో మహిళలకు పురుషులు బోధించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. తాలిబన్ల తాత్కాలిక ఉన్నత విద్యా శాఖ మంత్రి అబ్దుల్ బఖి హక్కానీ ఈ మేరకు తెలిపారు. తాము మహిళల హక్కులను గౌరవిస్తామని, కానీ అవి ఇస్లామిక్ చట్టానికి లోబడి ఉండాలని కరాఖండీగా చెప్పారు.

ఆదివారం హక్కానీ.. అఫ్గాన్​ యునివర్సిటీల సిబ్బంది, అధ్యాపకులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇందులో ఒక్క మహిళ కూడా పాల్గొనలేదు. అందరూ మగ విద్యార్థులే ఉన్నారు. వ్యవస్థాపరమైన నిర్ణయాల్లో మహిళలను భాగస్వాములను చేయొద్దనే ఉద్దేశంతోనే ఈ సమావేశానికి వారిని అనుమతించలేదని ఓ అధ్యాపకురాలు తెలిపారు. అమ్మాయిలకు మహిళా టీచర్లే బోధించాలంటే.. వారు ఉన్నత విద్యకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ప్రత్యేకంగా బోధించేందుకు సరిపడా వసతులు గానీ, మహిళా ప్రొఫెసర్లు గానీ లేరని వివరించారు.

గత 20 ఏళ్లలో అఫ్గాన్​లోని యూనివర్సిటీలలో మహిళల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. పురుషులతో పాటు తరగతులకు హాజరవుతున్నారు. అధ్యాపకులతో కలిసి సెమినార్లలో పాల్గొంటున్నారు. ఉన్నత విద్యకు దగ్గరయ్యారు. కానీ కొద్ది నెలులుగా తాలిబన్లు యూనివర్సిటీలపై దాడులు చేసి(Afghan Crisis) చాలా మందిని పొట్టనబెట్టుకున్నారు. దీంతో.. మహిళలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

మహిళలు పాడటానికి వీల్లేదు..

కాందహార్​లో మహిళా సంగీత కళాశాలలను కూడా మూసివేశారు తాలిబన్లు. వారు టీవీలు, రేడియో ఛానళ్లలో పాడకుండా నిషేధించారు. మహిళల స్వరాన్ని ప్రసారం చేయడానికి వీల్లేదని ఆయా ఛానళ్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.

ఆహారం రుచిగా వండలేదని మహిళ ఒంటికి నిప్పు..

ఆహారం రుచిగా వండలేదనే కారణంతో ఆగస్టు 17న ఓ మహిళ ఒంటికి నిప్పంటింటారు తాలిబన్లు. వారి అరాచకాలు ఎలా ఉంటాయో తెలిపేందుకు ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. అంతేగాకుండా.. జిహాదీలను పెళ్లి చేసుకోవాలని యువతులను తాలిబన్లు బలవంతం చేస్తున్నట్లు మాజీ జడ్జి నజ్లా అయుబి కొద్ది రోజుల క్రితమే తెలిపారు. మహిళలను శవపేటికల్లో బంధించి ఇతర దేశాలకు తరలిస్తున్నారని, అక్కడ వారిని సెక్స్​ బానిసలుగా మారస్తున్నారనే భయానక విషయాలను వెల్లడించారు.

దేశం వీడిన మహిళా జర్నలిస్టు..

అఫ్గాన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి తాలిబన్ ప్రతినిధితో లైవ్ ఇంటర్వ్యూ చేసి ప్రపంచ నలుమూల నుంచి ప్రశంసలు అందుకుంది 24 ఏళ్ల మహిళా జర్నలిస్టు బెహష్తా అర్ఘాంద్​. టోలో న్యూస్ ఛానల్​లో పనిచేస్తున్న ఈమె ఇప్పుడు దేశం వీడి వెళ్లింది. తాలిబన్లు జర్నలిస్టులపై దాడి చేస్తున్నారనే భయంతోనే ఇలా చేసినట్లు చెప్పింది. అయితే తాలిబన్లు ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళల హక్కులను గౌరవిస్తున్నట్లు పరిస్థితులు అనిపిస్తే తాను స్వదేశానికి తిరిగివస్తానని స్పష్టం చేసింది. కానీ ఆ అవకాశాలు కన్పించడం లేదు.

మహిళలకు కొత్తేం కాదు..

అఫ్గాన్ మహిళలకు హింస, అణచివేత కొత్తేం కాదని 2015లో నిర్వహించిన ఓ అధ్యయానాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ సర్వే ప్రకారం అఫ్గాన్​వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 90 శాతం మంది మహిళలు భర్తల నుంచి గృహహింసను ఎదుర్కొంటున్నారు. ఎలాగోలా భర్త నుంచి విడిపోయిన కొందరు మహిళలకు.. ఆ తర్వాత ఇతరుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. తాము నమ్మిన వ్యక్తులు, పోలీసులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులే వారిని దుర్భాషలాడుతున్నారు. మహిళలకు ఆశ్రయమిచ్చే పలు నివాసాలపై దాడులు జరుగుతున్నాయి.

అప్పట్లో ఆరాచక పాలన..

1996లో తాలిబన్లు అఫ్గాన్​లో అధికారం చేపట్టినప్పుడు(Taliban Rule in Afghan) మహిళల పరిస్థితి దుర్భరంగా ఉండేది. ఇస్లామిక్ చట్టం ప్రకారం కఠినమైన ఆంక్షలు విధించేవారు. మగ తోడు లేకుండా ఆడవారిని గడప దాటనిచ్చేవారు కాదు. చదువుకోవడానికి నిరాకరించేవారు. ఇంటి బయట పనికి వెళ్లనిచ్చేవారు కాదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా శిక్షించేవారు. మహిళలు తప్పు చేస్తే బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేవారు.

ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందేమోనని అప్గాన్ మహిళలు కలత చెందుతున్నారు.

ఇవీ చదవండి: Afghan Taliban: టీవీ యాంకర్​ను లైవ్​లో గన్స్​తో బెదిరించిన తాలిబన్లు

Afghan Crisis: పెనం పై నుంచి పొయ్యిలోకి..

Taliban news: జానపద గాయకుడిని చంపేశారు..!

Afghan Taliban: 'అవన్నీ తిరిగిచ్చేయండి'.. పౌరులకు తాలిబన్ల ఆర్డర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.