ETV Bharat / international

తాలిబన్లు అంటే ఉగ్రవాదులు కాదు: పాక్ ప్రధాని - తాలిబన్ల గురించి ఇమ్రాన్ ఖాన్

తాలిబన్లు.. ఉగ్రవాద సంస్థలకు చెందినవారు కాదని, వారు కూడా సాధారణ పౌరులేనని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ వ్యాఖ్యానించారు. పాక్​ సరిహద్దులో ఉన్న 30లక్షల మంది అఫ్గాన్ శరణార్థులకు తాము ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు.

imran khan
ఇమ్రాన్​ ఖాన్
author img

By

Published : Jul 29, 2021, 10:46 AM IST

తాలిబన్లు.. ఉగ్రవాద సంస్థలకు చెందినవారు కాదని పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్ పేర్కొన్నారు. వారు కూడా సాధారణ పౌరులేనని చెప్పారు. 30 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు సరిహద్దులో ఉన్న నేపథ్యంలో తాలిబన్లను తాము ఎలా మట్టుబెట్టగలమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. శరణార్థుల్లో చాలా మంది తాలిబన్ల సమూహానికి చెందిన పాస్థూన్లేనని ఇమ్రాన్ ఖాన్​ పేర్కొన్నారు. వారందరికీ తాము ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు.

"ఇప్పుడు అక్కడ శరణార్థ శిబిరాల్లో 10లక్షల మంది ఉన్నారు. తాలిబన్లేమీ ఉగ్రవాద సంస్థలకు చెందినవారు కాదు. వాళ్లు సాధారణ పౌరులే. ఈ శిబిరాల్లో ఉన్నది పౌరులే అయితే... వారిని పాకిస్థాన్​ ఎలా అంతమొందించగలదు? అలాంటప్పడు వాటిని శరణార్థ శిబిరాలు అని ఎలా పిలవగలం?"

-ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్ ప్రధాని.

తాలిబన్లకు ఆయుధపరంగా, ఆర్థికంగా పాక్​ సాయం చేస్తుందన్న వార్తలను ఇమ్రాన్ ఖాన్​ ఖండించారు. అవన్నీ పూర్తి అవాస్తవాలని చెప్పారు. "తాలిబన్ సమూహానికే చెందిన మూడు లక్షల మంది పాకిస్థాన్​లో శరణార్థులుగా​ ఉన్నారు. అలాంటప్పుడు తాలిబన్లకు పాకిస్థాన్​ స్వర్గధామం అనడానికి ఆస్కారమేది?" అని ఆయన ప్రశ్నించారు.

2001, సెప్టెంబర్​ 11న అమెరికా న్యూయార్క్​లో జరిగిన దాడికి, పాకిస్థాన్​కు ఏ సంబంధమూ లేదని ఇమ్రాన్ ఖాన్​ స్పష్టం చేశారు. ఆ ఘటన అనంతరం.. అఫ్గాన్​పై అమెరికా జరిపిన యుద్ధం కారణంగా వేలాది మంది పాకిస్థానీయులు తమ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.