క్వారంటైన్ నిబంధనలను ఏడు సార్లు ఉల్లఘించినందుకు ఓ వ్యక్తికి రూ. 25,52,098 (35,000 డాలర్లు) జరిమాన వేశారు అధికారులు. ఈ పరిణామంతో ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఘటన తైవాన్‌లోని తైచూంగ్ నగరంలో జరిగింది.
తైచూంగ్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వ్యాపార పని మీద కొద్దిరోజుల క్రితం చైనాకు వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత వెంటనే అతన్ని తన ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచారు అధికారులు. అయితే క్వారంటైన్లో ఉన్న మూడురోజులలోనే ఏడు సార్లు నిబంధనలను ఉల్లఘించి బయటకి వెళ్లాడావ్యక్తి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు అతనికి రూ.25,52,098 జరిమాన విధించారు. క్వారంటైన్ ఖర్చు కింద రోజుకు రూ. 7,801 కట్టాలని ఆదేశించారు.
గత ఏడాది డిసెంబర్లో ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి 8 సెకన్లు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించాడని రూ.2,55,194 జరిమాన విధించారు.
ఇదీ చూడండి: కరోనాకు సాంకేతిక కళ్లెం వేయడంలో.. ఆ దేశాలు విజయం!