శ్రీలంకలో వరుస బాంబు దాడులు చేసిన నేషనల్ తౌహీత్ జమాత్(ఎన్టీజే)తో పాటు 'జమాతే మిలాతే ఇబ్రహీమ్(జేఎమ్ఐ)', 'విల్లాయత్ అస్ సెలాని(డబ్ల్యూఏయస్)' ఉగ్రసంస్థలపై నిషేధం విధించింది ఆ దేశ ప్రభుత్వం. దేశంలో డ్రోన్ల వినియోగంపైనా నిషేధం విధిస్తున్నట్లు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు. గత నెల 21న ఈస్టర్ పర్వదినాన కొలంబోలో జరిగిన వరుస బాంబుదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మారణహోమంలో 250 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి : వరుణుడి రాక ఆలస్యం- లోటు వర్షపాతం!